బస్సు – లారీ ఢీ… నలుగురు మృతి
నెల్లూరు ముచ్చట్లు:
ఆంద్ర సరిహద్దు దాటినా తరువాత తమిళనాడు పరిధి లోని పొన్నేరి సమీపం లో జాతీయరహదారి పై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి చెన్నై వెళుతున్న ప్రెవేటు ట్రావెల్స్ బస్సును టాంకర్ లారీ డీ కొట్టడం తో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో బస్సు క్లినర్ శ్రీధర్ తో పాటు నెల్లూరు జిల్లా విడవలూరు ప్రాంతానికి చెందిన తోకల సతీష్ కుమార్ ,బెంగుళూరుకు చెందిన తుమ్మల రోహిత్ లు అక్కడికక్కడే మృతి చెందానేజ ఈ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరం లో చెన్నై వెళ్ళడానికి బస్సు ఎక్కిన తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్ జానకిరామ్ కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు, నుజ్జు నుజ్జు ఐన బస్సులో చిక్కున్న మృతుల మృత దేహాలను కవర్ పేట పోలీస్ లు అగ్నిమాపక సిబ్బంది సహకారం తో మృతదేహాలను వెలికి తీసారు.
Tags; Bus-Lorry collision… Four killed

