నెల రోజులుగా బస్ షెల్టర్ రే నివాసం

Bus Shelter Ray residence for months

Bus Shelter Ray residence for months

– ప్రయాణికులకు ఇక్కట్లు

Date:22/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

 

గత నెల రోజులుగా ఓ మతిస్థిమితం లేని వ్యక్తి బస్ షెల్టర్ నే నివాసంగా మార్చుకున్న సంఘటన పుంగనూరు పట్టణంలోని ఇందిరా సర్కిల్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు…. గత నెల రోజులుగా అమీర్ ఖాన్ అనే వ్యక్తి బట్టలు, సూట్కేస్ తో వచ్చి ఇందిరా సర్కిల్ ల్లోనున్న బస్ షెల్టర్ లో నివాసం ఏర్పరుచుకున్నాడు. దింతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రయాణికులు తలదాచుకోవడానికి దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే సదరు వ్యక్తిని విచారిస్తే తనది మేలుపట్ల అని, తన కుమారుడు ఇంట్లోనుంచి గెంటేసినట్లు పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. సంబంధిత అధికారులు స్పందించి బస్ షెల్టర్ ల్లోనున్న వ్యక్తిని వివరాలు తెలుసుకుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

పూట గడవని చాపల వ్యాపారులు

Tags: Bus Shelter Ray residence for months

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *