Natyam ad

ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర

విశాఖపట్టణం ముచ్చట్లు:

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలోఈనెల 26 నుంచి వచ్చే నెల 9 వరకూ మొదటి దశలో సామాజిక న్యాయ బస్సు యాత్ర ప్రారంభిం చేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు విశాఖలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లా నుంచి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి ఆధ్వ ర్యంలో ఈ యాత్రకు సంబంధించి ప్రణాళికపై చర్చించారు. విశాఖ రాజధానిగా దసరా నుంచి పాలన అందిస్తారని ఎదురుచూస్తున్న వేళ ఇది వాయిదా పడేటట్టు కనిపిస్తోంది. అందుకే ముందుగా ముందుగా సామాజిక బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 26న జిల్లాలోని ఇచ్చాపురం నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అప్పటి వరకూ ప్రజల్లో నిరంతరం ఉండాలన్న లక్ష్యం మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు.  ఈనెల 26న ప్రారంభించే యాత్ర రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కొనసాగించేందుకు నిర్ణయించారు. ఉత్తరాంధ్రలో ఈనెల 26 నుంచి వచ్చేనెల 9 వరకూ అంటే 13 రోజులుపాటు వైసీపీ ముఖ్యనేతలంతా బస్సు యాత్రలో పాల్గొంటారు.

 

 

 

 

Post Midle

ఇప్పటికే నవంబరు 15 వరకూ ప్రజల్లో కేడరంతా ఉండేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి మళ్లీ జగన్మోహనరెడ్డి ఎందుకు అవసరమని ప్రజలకు వివరించేందుకు ప్రధాన ఉద్దేశంతో నేతలు ఈ యాత్ర చేయనున్నారు.బస్సు యాత్రలో రాజధాని విషయం ప్రస్తావించాలని నిర్ణయించారు. వచ్చేనెల 6న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జిల్లా పర్యటన ఉంది. పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 700కోట్లతో ఉద్దానం తాగునీటి పథకం అదే రోజు ప్రారంభించనున్నారు. ఈ అంశాలతోపాటు జిల్లాలో గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారంచేయనున్నారు.ఉత్తరాంధ్ర మంత్రుల సామాజిక బస్సు యాత్ర ఈనెల 26న ఇచ్ఛాపురంలో ప్రారంభం కానుంది. 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆమదాలవలస, నవంబరు 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4న ఎస్.కోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లి మీదుగా సాగనుంది.

 

 

 

దసరాకు తరలింపు లేనట్టే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ‌ప‌ట్నంకు మాకం మార్చడం ఆల‌స్యం కానుంది. విజ‌య‌ద‌శ‌మికి విశాఖ‌ప‌ట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యం ప్రారంభిస్తార‌ని.. అక్కడి నుంచే పాల‌న చేస్తార‌ని గ‌తంలో వైసీపీ నేత‌లు ప్రక‌టించారు.. దానికి త‌గ్గట్లుగా ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి విశాఖ రాక‌కోసం వికేంద్రీక‌ర‌ణ జేఏసీ కూడా విశాఖ‌ప‌ట్నంలో భారీ స్వాగ‌త ఏర్పాట్లు చేయాల‌ని స‌మావేశం కూడా పెట్టుకుంది. మూడు ప్రాంతాల అభివృద్ది మా ల‌క్ష్యం అంటూ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌దేప‌దే చెబుతున్నారు. ఇక విశాఖ‌ప‌ట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యం ఏర్పాటుచేసి అక్కడి నుంచే స‌మీక్షలు కూడా చేయ‌డం ద్వారా స‌మ‌గ్రాభివృద్ది ల‌క్ష్యాన్ని ప్రజ‌ల్లోకి తీసుకెళ్లిన‌ట్లు అవుతుంద‌ని కూడా భావించారు. ఇక వైఎస్సార్ సీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి వంటి ముఖ్య నేత‌లు కూడా సీఎం విశాఖ‌కు షిఫ్ట్ అవుతున్నార‌ని చెప్పారు…దీంతో ద‌స‌రా శ‌ర‌న్నవ‌రాత్రుల చివ‌ర్లో అంటే అక్టోబ‌ర్ 23న సీఎం క్యాంపు కార్యాల‌యం లో గృహ‌ప్రవేశం చేసి 24 వ తేదీనుంచి అక్కడి నుంచే ప‌రిపాల‌న చేస్తార‌ని కూడా చెప్పారు.

 

 

 

దీంతో ఇక ద‌స‌రాకు అమ‌రావ‌తి నుంచి విశాఖ‌ప‌ట్నంకు సీఎం షిఫ్ట్ అవుతార‌ని జోరుగా ప్రచారం జ‌రిగింది. తాజా ప‌రిస్థితుల‌తో సీఎం విశాఖ నుంచి పాల‌న చేయ‌డం మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ని తెలిసింది. అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు షిఫ్టింగ్ ద‌స‌రాకు లేన‌ట్లే అని ప్రభుత్వ వ‌ర్గాలు స్పష్టం చేసాయి. కొన్ని కార‌ణాల‌తో వాయిదా త‌ప్పడం లేద‌ని చెబుతున్నాయి.ముఖ్యమంత్రి విశాఖ‌ప‌ట్నం నుంచి పాల‌న సాగించేందుకు అక్కడ పూర్తి స్థాయిలో వ‌స‌తుల క‌ల్పన పూర్తికాలేదు. దీంతోనే ద‌స‌రాకు సీఎం క్యాంపు కార్యాల‌యం ప్రారంభోత్సవం వాయిదాప‌డింద‌ని అధికారులు చెబుతున్నారు. విశాఖ‌ప‌ట్నంలో ఉన్న రుషికొండ‌పై సీఎం క్యాంపు కార్యాల‌యం నిర్మాణం జ‌రుగుతుంది. ముందుగా ద‌స‌రా నాటికి ఈ భ‌వ‌నంలో అన్ని మౌళిక‌వ‌స‌తులు పూర్తి చేసి అప్పగించాల‌ని కోరిన‌ప్పటికీ. సాధ్యం కాక‌పోవ‌డంతోనే వాయిదా త‌ప్పడం లేదంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం సీఎంతో పాటు అధికారులు కూడా విశాఖ‌ప‌ట్నంలో ఉండి స‌మీక్షలు చేయాల్సిన అవ‌స‌రం ఉందంటూ రెండు జీవోలు జారీ చేసింది ప్రభుత్వం.

 

 

 

దీనికి సంబంధించి వ‌స‌తి సౌక‌ర్యం చూసేందుకు ముగ్గురు అధికారుల‌తో క‌మిటీ కూడా నియ‌మించింది. మున్పిప‌ల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి, సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ కార్యద‌ర్శుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది. విశాఖ‌లో మంత్రులు, అధికారులు ఉండేందుకు వీలుగా కావ‌ల్సిన వ‌స‌తి ఏర్పాట్లు చూడాల‌ని క‌మిటీకి ఆదేశించింది. దీంతో ఈ క‌మిటీ వెంట‌నే ప‌ని కూడా ప్రారంభించింది.మంత్రులు, శాఖ‌ల వారీగా ఎంతెంత మేర స్థలం అవ‌స‌రం, భ‌వ‌నాలకు సంబంధించిన వివ‌రాలు సేక‌రిస్తుంది. ఈ క‌మిటీ పూర్తి స్థాయిలో నివేదిక సిద్దం చేసిన త‌ర్వాత ప్రభుత్వానికి వివరాలు అందించ‌నుంది. ఇప్పటికే విశాఖ‌ప‌ట్నంల‌లో అనుకూలంగా ఉండే భ‌వ‌నాల ఎంపిక కూడా చేస్తుంది. సీఎం కార్యాల‌య సిబ్బందితో పాటు సీఎస్, మంత్రులు,కార్యద‌ర్శుల‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తి చూసిన త‌ర్వాతే ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ‌లో మ‌కాం వేస్తార‌ని తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ భ‌వ‌నం నిర్మాణంతో పాటు ఇత‌ర వ‌స‌తులు చూసేందుకు మ‌రో నెల రోజులు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాతే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాల‌న చేస్తార‌ని అధికారులు చెబుతున్నారు. న‌వంబ‌ర్ నెలాఖ‌రు లేదా డిసెంబ‌ర్ లో సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు షిఫ్ట్ అయ్యే అవ‌కాశాలున్నట్లు తెలిసింది.

 

Tags: Bus trip from Ichchapuram

Post Midle