బ్రాహ్మణులలో చైతన్యం తీసుకొచ్చేందుకే బస్సు యాత్ర

Bus trip to bring awareness in Brahmins

Bus trip to bring awareness in Brahmins

– ఒక జిల్లాలో ఐదు రోజులు
– రెండు బస్సుల్లో పయణం
– జ్వాలాపురం శ్రీకాంత్‌

Date:13/04/2018

అనంతపురం ముచ్చట్లు:

రాష్ట్రంలోని బ్రాహ్మణులలో ఆర్థిక, రాజకీయ , సామాజిక రంగాలలో చైతన్యం తీసుచ్చేందుకే బస్సుయాత్రను ప్రారంభించాం…. ఒకొక్క జిల్లాలో రెండు బస్సుల్లో సుమారు 60 మంది మేధావులను, మఠాధిపతులను తీసుకుని , జిల్లాలో ఐదు రోజులు పర్యటిస్తాం….. బ్రాహ్మణుల ఐకమత్యాన్ని చాటిచెబుతామని ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌ తెలిపారు. బస్సుయాత్రను 13 జిల్లాలో ఒకొక్క జిల్లాలో ఐదు రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు కార్యచరణ ప్రణాళికను మే వెహోదటి వారంలో గుంటూరులో సమావేశం నిర్వహించి, బ్రాహ్మణ కుటుంబాల సూచనల మేరకు తేదీలు నిర్ణయిస్తామన్నారు. యాత్ర ప్రారంభించే స్థలము, యాత్ర టీమ్‌ వివరాలను నిర్ణయిస్తామన్నారు. జిల్లాలోని ఆయా కార్యవర్గ సభ్యులను బాగస్వామ్యులను చేసుకుంటు , జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు మున్సిపాలిటిలను, ప్రధాన మండల కేంద్రాలను కూడ యాత్రలో పర్యటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బస్సుయాత్రలో అన్ని శాఖలకు చెందిన మఠాధిపతులను, పీఠాధిపతులను, న్యాయమూర్తులు, ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లతో పాటు ప్రజాప్రతినిధులను బ్రాహ్మణుల అభివృద్ధికి చేయూతనిచ్చే అన్ని పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించి, వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు.

మూడు బహిరంగ సభలు ….

రాష్ట్రంలో బస్సుయాత్ర సందర్భంగా మూడు బహిరంగ సభలు నిర్వహించాలని సభ్యులు సూచించారని శ్రీకాంత్‌ తెలిపారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలలోని బ్రాహ్మణులు తరలివచ్చేలా బహిరంగ సభల స్థలాలను గుంటూరులో జరిగే సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. కనుక బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరు ఐకమత్యంతో ముందుకురావాలని పిలుపునిచ్చారు.

Tags: Bus trip to bring awareness in Brahmins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *