డిపోలకే పరిమితమైన బస్సులు

Date:22/10/2019

నల్గొండ  ముచ్చట్లు:

ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. 18వ రోజైన మంగళవారం కూడా కార్మికుల నిరసనలు కొనసాగాయి. విధుల్లోకి వెళ్లొద్దని తాత్కాలిక సిబ్బందికి కార్మికులు విజ్ఞప్తి చేసారు. . తెలంగాణ వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. తాత్కాలిక సిబ్బంది విధులకు వచ్చినా డ్యూటీ ఎక్కలేదు. అందుకు కారణం ఆర్టీసీ కార్మికులందరూ కలిసి తమ సమ్మెకు మద్దుతు ఇవ్వాలని తాత్కాలిక సిబ్బందిని కోరడమే. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని తాత్కాలిక సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి కోరుతున్నారు. దీంతో తాత్కాలిక సిబ్బంది ఎవరూ విధులకు హాజరుకాలేదు. అంతేకాదు సమ్మెకు మద్దతివ్వాలంటూ అధికారులు, ప్రజలకు గులాబీ పూలు ఇచ్చి విజ్ఞప్తి చేస్తున్నారు.

 

 

 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, నార్కెట్పల్లి, దేవరకొండ యాదగిరిగుట్ట డిపోల నుంచి బస్సు బయటకు రాలేదు. దీంతో ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. దేవరకొండ యాదగిరిగుట్ట డిపోల్లో తాత్కాలిక సిబ్బందిని బతిమలాడుతున్న ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ, దేవరకొండ, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ, నార్కెట్పల్లి డిపోల్లో భారీగా పోలీసులను మోహరించారు.

నెల్లూరులో భారీ వర్షాలు

Tags: Buses limited to the depot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *