Natyam ad

పుంగనూరు జగనన్న మహిళా మార్ట్లలో వ్యాపారాల జోరు

– ద్వితీయ స్థానంలో పుంగనూరు
-మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
-20 నెలలో రూ.3.80 కోట్ల వ్యాపారం

 

 

పుంగనూరు ముచ్చట్లు:

 

Post Midle

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వ్యాపార రంగంలోకి తొలిసారిగా పులివెందులలో మహిళల భాగస్వామ్యంతో జగనన్న మహిళా మార్ట్లలో 2021 జనవరి 3న పులివెందులలో ప్రారంభించారు. అప్పటి నుంచి మహిళలు జగనన్న మహిళా మార్ట్ల ద్వారా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. అదే విధంగా గత సంవత్సరం మార్చి 29న రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల కృషితో జగనన్న మహిళా మార్ట్ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాలలో పుంగనూరు ద్వితీయ స్థానంలో నిలచడంతో పలువురు మహిళలను అభినందిస్తున్నారు.

రాష్ట్రంలో ఏర్పాటైన కేంద్రాలు…

రాష్ట్రంలో జగనన్న మహిళా మార్ట్లను 10 ప్రాంతాలలో ప్రారంభించారు. పులివెందుల ,పుంగనూరు రాయచోటి, అద్దంకి, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూల్‌, మర్కాపురం, ఒంగోలు లో నిర్వహిస్తున్నారు. ఒకొక్క మహిళా రూ.300 లు బాగస్వామ్యంతో ఏర్పాటైన మార్ట్లలో సుమారు 10 వేల మంది సభ్యులతో రూ.30 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు.

వ్యాపారాలు…

రాష్ట్రంలో ఏర్పాటైన జగనన్న మహిళా మార్ట్లో ప్రతి రోజు రూ.70 వేలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు లక్షరూపాయలు ఆదాయం లభిస్తోంది. మార్ట్లో పని చేసే సిబ్బంది 7 మందికి జీతబత్యాలు, కరెంటు ఖర్చులకు గాను నెలకు రూ. 80 వేలు కేటాయించారు.

ఆదాయం…

పుంగనూరులో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్లో తొలినెల రూ. 87 వేలు వ్యాపారం జరిగింది. ఈ వ్యాపారం క్రమేణ పుంజుకోవడంతో నెలకు లక్షరూపాయలకు పైగా ఆదాయం చేకూరుతోంది. ఈ విధంగా 20 నెలల కాలంలో రూ.20 లక్షలు ఆదాయం రావడంతో పెట్టుబడి పెట్టిన మహిళలకు ఒకొక్కరికి రూ.300లకు అదనంగా రూ.100 కలిపి రూ.400లు త్వరలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

మార్ట్లలో వ్యాపారాలు..

జగనన్న మహిళామార్ట్లలో కంపెనీ సరుకులు మాత్రమే కొనుగోలు చేసి తక్కువ ఆదాయంతో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 80,893 మంది మార్ట్లలో సరుకులు కొనుగోలు చేయడంతో రూ.3.80 కోట్లు వ్యాపార లావాదేవిలు జరిగాయి. రాష్ట్రంలో పుంగనూరు వ్యాపారాలు ద్వితీయ స్థానంలో నిలిచాయి.

అధికారుల కృషి …

మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌, మెప్మా పీడి రాధ, టౌనమిషన్‌ కోఆర్డినేటర్‌ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్ట్ వ్యాపారాలలో ముందంజ వేసింది. మహిళల భాగస్వామ్యంతో ఉన్న మార్ట్లలో విక్రయించే సరుకులు తక్కువ ధరతో నాణ్యమైన వస్తువులను విక్రయించడం జరుగుతోంది.

మహిళలు స్వతంత్రంగా అభివృద్ధి చెందాలి…

మహిళలు తమకు తాముగా స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న మహిళా మార్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మహిళలు వ్యాపార రంగంలో అనుభవం గడించి రాణిస్తుండటం అభినందనీయం. మహిళల భాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతాం.

– రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

మహిళలకు చేయూత….

జగనన్న మార్ట్ల ద్వారా గ్రూపుల్లోని సభ్యులు ఒకొక్కరు రూ.300లు పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించారు. ప్రతి నెల లక్షరూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన సరుకులు విక్రయించడం జగనన్న మహిళా మార్ట్ల లక్ష్యం. దీని ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోంది. వ్యాపారంలో చురుగ్గా ఉన్న మహిళలందరికి అభినందనలు.

– ఎస్‌.అలీమ్‌బాషా, మున్సిపల్‌ చైర్మన్‌ , పుంగనూరు.

Tags:Business is booming at Punganur Jagananna Mahila Marts

Post Midle