మళ్లీ నష్టాల్లో మార్కెట్లు

Date:12/07/2019

ముంబై ముచ్చట్లు:

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య వాణిజ్య యుద్దం మళ్లీ తెరపైకి రావడంతో… ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు పతనమై 38,736కి పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 11,552 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (2.44%), సన్ ఫార్మా (2.41%), టాటా స్టీల్ (2.34%), ఏషియన్ పెయింట్స్ (2.05%), హీరో మోటో కార్ప్ (2.04%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.08%), ఓఎన్జీసీ (-2.06%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.98%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.87%), ఎల్ అండ్ టీ (-1.85%).

ప్రజల సంక్షేమం కోసమే బడ్జెట్‌

Tags: Again the distressed markets

భారీ నష్టాల్లో మార్కెట్లు

Date:08/07/2019

ముంబై ముచ్చట్లు:

దేశీ స్టాక్‌మార్కెట్ సోమవారం కుప్పకూలింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ ఇన్వెస్టర్లకు నచ్చకపోవడం ఇందుకు కారణం. నిఫ్టీ 11,600 స్థాయి కిందకు పతనమైంది. సెన్సెక్స్ 39,000 మార్క్ కిందకు పడిపోయింది. మార్కెట్ ఆరంభంలోనే భారీగా నష్టపోయింది. బెంచ్ మార్క్ సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 908 పాయింట్లమేర పడిపోయింది. నిఫ్టీ 288 పాయింట్లమేర కుప్పకూలింది. చివరకు సెన్సెక్స్ 793 పాయింట్ల (2.01 శాతం) నష్టంతో 38,721 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 253 పాయింట్ల (2.14 శాతం) నష్టంతో 11,559 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

 

 

 

పతనానికి కారణాలు ఇవే..
✺ అంతర్జాతీయ మార్కెట్ బలహీనంగా ఉండటం. అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్టాన్ స్టాన్లీ ప్రపంచపు ఈక్విటీ మార్కెట్లను డౌన్‌గ్రేడ్ చేయడం ఇందుకు కారణం.
✺ విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుల పెంపు. మోదీ ప్రభుత్వపు బడ్జెట్ ప్రతిపాదనల వల్ల సంపన్నులు ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. విదేశీ ఇన్వెస్టర్లపై ప్రభావం పడనుంది. దీంతో వారు మార్కెట్‌ నుంచి డబ్బులు వెనక్కు తీసుకుంటున్నారు.
✺ నిర్మలా సీతారామన్ లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్స్‌ వాటాను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని తన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో భాగంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీని కోరింది. దీంతో ఐటీ, పీఎస్‌యూ, పలు ఎంఎన్‌సీలపై ప్రతికూల ప్రభావం పడనుంది.
✺ జూన్ త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను వెల్లడించేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. వచ్చే వారం నుంచి జూన్ క్వార్టర్ ఫలితాలు వెల్లడి ప్రారంభమౌతుంది. ఈ నేపథ్యంలోనూ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
✺ టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీకి 11,700 వద్ద కీలక మద్దతు లభిస్తుంది. ఇండెక్స్‌కు 50 రోజుల ఎక్స్‌పొన్షియల్ మూవింగ్ యావరేజ్ 11,722 వద్ద ఉంది. సూచీ ఈ స్థాయి కిందకు పడిపోయింది. ఇది బుల్స్‌కు ప్రతికూల అంశం.
మార్కెట్ హైలైట్స్..

 

 

 

 

 

 

✺ నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ ఏకంగా 6 శాతం పెరిగింది.
✺ అదేసమయంలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, హీరో మోటొకార్ప్ షేర్లు పడిపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ ఏకంగా 10 శాతానికి పైగా కుప్పకూలింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 6 శాతం పతనతమైంది. ప్రైవేట్ బ్యాంక్, మెటల్, బ్యాక్, ఫైనాన్షియల్ సర్వీసెసర్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పడిపోయాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా 3 శాతానికి పైగా క్షీణించింది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.08 శాతం పెరుగుదలతో 64.28 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.07 శాతం క్షీణతతో 57.47 డాలర్లకు తగ్గింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. దాదాపు 27 పైసలు క్షీణతతో 68.69 వద్ద కొనసాగుతోంది.

 

ఈ నెల 27న విశాల్‌ ‘అయోగ్య’ తెలుగులో గ్రాండ్‌ రిలీజ్‌

 

 

Tags: Markets with huge losses

బడ్జెట్‌ ప్రకటనకు భిన్నంగా ఆర్థిక బిల్లు!

-పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2 సుంకం పెంపు?

 

Date:08/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

మోడీ.. పాలనలో దేశం ఇలా అయ్యిందని గొప్పలు చెప్పుకునే వారికి తన తాజా బడ్జెట్ లో వరం ఇవ్వటం తర్వాత.. నిత్యవసర వస్తువైన పెట్రోల్.. డీజిల్ మీద లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ వాత పెట్టిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు తాముకానీ పవర్లోకి వస్తే.. లీటరు పెట్రోల్.. డీజిల్ రూ.50 కంటే తక్కువకే కట్టడి చేస్తామని.. భారీగా వేస్తున్న పన్నుల భారం నుంచి తప్పిస్తామంటూ సోషల్ మీడియాలో చెప్పిన మాటలు అన్ని ఇన్ని కావు.అయితే.. అలాంటివేమీ మోడీ-1లో చేయని కేంద్రం.. తన తాజా టర్మ్ లోనూ అలాంటివేమీ చేయకపోగా.. కొత్త వాత పెట్టేందుకు రెఢీ అవుతున్న తీరు ఆందోళనగా మారిందని చెప్పాలి. బడ్జెట్ లో లీటరుకు రూ.2చొప్పున పెంచుతున్నట్లు చెప్పగా.. ఆర్థిక బిల్లులో మాత్రం అందుకు భిన్నంగా లీటరుకు రూ.5 చొప్పున పెంచేస్తూ బిల్లును రూపొందించినట్లుగా తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో పెట్రో బాదుడు మరింత భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం బడ్జెట్‌లో చెప్పింది ఒకటి.. ఆర్థిక బిల్లులో పొందుపర్చింది మరొకటి! పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2 సుంకాలు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. కానీ, మరో రూ.5 పెంచేందుకు వీలుగా ఆర్థిక బిల్లును రూపొందించింది. దీన్ని బట్టి చూస్తే మున్ముందు మళ్లీ పెట్రో బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

 

 

 

 

 

 

 

ప్రస్తుతానికి పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటరుకు రూ.2 మాత్రమే పెంచాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించినా, అదను చూసి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు ప్రత్యేక అదనపు పన్ను (ఎస్‌ఏడీ) రూపాయి, రహదారులు, మౌలిక వసతుల సుంకం మరో రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు.దీన్ని బట్టి లీటరు పెట్రోల్‌కు ఎస్‌ఏడీ రూ.8కి, డీజిల్‌పై రూ.2కు పెరుగుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ రెండింటిపైనా సుంకం రూ.9కు పెరుగుతుంది. బడ్జెట్‌ ప్రకటనలను చట్టంగా మార్చే ఆర్థిక బిల్లు వద్దకు వచ్చేసరికి మాట మారిపోయింది. ఈ పన్ను, సుంకం ఇంకా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం మార్గం తెరిచి ఉంచుకుంది. లీటరు పెట్రోల్‌పై ఎస్‌ఏడీ రూ.7 నుంచి రూ.10కి, డీజిల్‌పై రూపాయి నుంచి రూ.4కు పెంచేందుకు వీలుగా ఆర్థిక బిల్లులోని 185వ క్లాజ్‌లో పొందుపర్చింది. అలాగే 201వ క్లాజ్‌లో రహదారులు, మౌలిక వసతుల సెస్సు రూ.8 నుంచి రూ.10కి పెంచేలా నిర్దేశించింది. ఈ రెండూ కలుపుకుంటే పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు లీటరుకు మరో రూ.5 పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రూ.2 పెంచినా, ప్రభుత్వం కావాలనుకున్నప్పుడు మరింత పెంచుతుంది.

 

వైకాపా కార్యాలయంలో వైఎస్ జయంతి

Tags: Budget Advertisement Financial Bill!

భారీగా పెరిగిన బంగారం ధరలు

Date:26/06/2019

ముంబై ముచ్చట్లు:

పసిడి ధర అడ్డూఅదపు లేకుండా పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్‌లో బుధవారం  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.470 పెరుగుదలతో రూ.36,080కు ఎగసింది. అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలముగా లేకున్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం పసిడి ధరపై సానుకూల ప్రభావం చూపింది. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.430 పెరుగుదలతో రూ.33,080కు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర కేవలం రూ.5 తగ్గుదలతో రూ.40,355కు క్షీణించింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.34,550 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్థిరంగా రూ.33,350 వద్ద ఉంది. కేజీ వెండి ధర రూ.5 తగ్గుదలతో రూ.40,355కు క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. అయినా కూడా బంగారం ధర ఔన్స్‌కు 1,400 డాలర్ల మార్క్ పైనే కదలాడుతోంది. బుధవారం ఔన్స్ పసిడి ధర 0.27 శాతం తగ్గుదలతో 1,414.75 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.25 శాతం క్షీణతతో 15.25 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

అన్నదమ్ముల మధ్య ఆమాత్య గొడవలు

Tags: Hugely increased gold prices

26 నుంచి బడ్జెట్ సమావేశాలు

Date:13/06/2019

గుంటూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. కేబినెట్ కూర్పు, కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్న జగన్.. ఏకంగా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారట. 20 రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని తెలుస్తోంది.  ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18తో ముగుస్తాయి. తర్వాత వారం పాటూ విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారట. బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు చేసే పనిలోనూ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. జులై 10తో కొత్త బడ్జెట్‌ని ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూన్ నెలాఖరుకు ముగియనుంది. అందుకే బడ్జెట్ సమావేశాలపై కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1, 91,63,000 కోట్లతో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కొత్త మంత్రివర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలు దక్కాయి. మరి ఈ బడ్జెట్‌లో వైసీపీ హామీలు, నవరత్నాలకు ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.

 

ఖరీఫ్ పై కోటి ఆశలతో రైతన్న

 

Tags: Budget meetings from 26

తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

ఖజానాలు ఖాళీ 

Date:04/06/2019

నెల్లూరు ముచ్చట్లు:

 

 

 

జిల్లాలోని మున్సిపాలిటీలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. వనరులు పుష్కలంగా ఉన్నా వినియోగించుకునే సదుపాయం లేక తంటాలు పడుతున్నారు. నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఖాతాలను స్తంభింపజేశారు. పురాలకు వచ్చే రాబడి అంతా ఉన్నతాధికారులు రాష్ట్ర ఖజానాకు చేరేలా చేస్తున్నారు. రూ.కోట్లకు కోట్లు పన్నుల రూపేణా రాబడి ఉన్నా క్షేత్రస్థాయిలో అధికారులు పాలకులు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో అభివృద్ధి పనులు సాగడం లేదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. పురాల ఖాతాల్లోపడే ప్రతి రూపాయిని ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుంటూ స్థానిక అవసరాలకు ఖర్చు చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని విధంగా నగదును వాడకుండా ఆంక్షలు విధించారు. వెరసి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా పురాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. వేసవిలో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు తిప్పలు పడుతున్నారు.

 

 

 

 

నెల్లూరు కార్పొరేషన్‌, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరి పురపాలక సంఘాల్లో కొన్ని నెలలుగా నిధులు వినియోగించే వీల్లేకపోవడంతో పనులు చేయడానికి పాలకులు ఇబ్బందులు పడుతున్నారు. రూపాయి ఖర్చు చేసేందుకు వీల్లేందుకు ఖాతాలను స్తంభింప చేశారు. వసూలు చేసిన నగదు మొత్తం రాజధాని నుంచి ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈఏడాది మార్చి వరకు రూ.700 కోట్ల వసూలు చేశారని తెలుస్తోంది. ఈ నిధులను వేరే పథకాలకు మళ్లించారని సమాచారం. పురపాలకాల ఖాతాలను స్తంభింపజేసి వచ్చిన నిధులను బదిలీ చేసి వినియోగించారు. జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట పురపాలక సంఘాల్లోనూ పెద్ద మొత్తంలో వసూలు చేశారు. ఈ నిధులు మొత్తం రాష్ట్ర ఖజనాకు చేరాయి.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కు రాబడికి మూలమైన దుకాణాల సముదాయాలకు వేలం పాటలు నిర్వహించలేదు. దీంతో కొన్ని చోట్ల మార్చి నెలాఖరు గడువు పూర్తి కావడంతో వేలం పాటలు జరపలేదు. ఎన్నికల నియమావళితో ఇంత వరకూ జరపలేదు. వ్యాపారులు ఖాళీ చేయలేదు. బకాయిలు కోట్లలో రావాల్సి ఉంది. వేలం పాటలు జరపడం ఇంకా ఆలస్యమయ్యే అవకాశముంది. ఇలా రాబడికి గండి పడుతోంది. ఇక మార్కెట్‌ సెస్సు, మత్స్య మార్కెట్‌లకు వేలం పాటలు జరపలేదు.

 

 

 

 

 

కార్పొరేషన్‌ , పురపాలక సంఘాల్లో కోట్లాది రూపాయల నిధులతో జరగాల్సిన పనులు ఆగాయి. నెల్లూరు కార్పొరేషన్‌లో ఎస్సీ, ఎస్టీ నిధులు రూ.150 కోట్లకు పైగా నిధులతో పనులు చేయాల్సి ఉంది. వీటిలో కొన్నింటికి టెండర్లు జరగాల్సి ఉంది. పనులు మొదలు కానివి అలాగే ఉన్నాయి. ఇలా పురపాలక సంఘంల్లో ఒక్కో చోట రూ.15 కోట్ల నుంచి రూ.50 కోట్ల పనులు జరగాల్సి ఉంది. కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో చిన్నచిన్న పనులు చేయలేని పరిస్థితి. నియమావళితో ఎక్కడా పనులు చేయకూడదని నిబంధన పెట్టడంతో ఏ పనీ జరగడంలేదు. జీతాలు, వాహనాలకు ఆయిల్‌ మినహా ఇతర ఖర్చు పెట్టకుండా ఉన్నతాధికారులు పురపాలక శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

 

 

నెల్లూరు కార్పొరేషన్‌లో వంద ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడడంతో ఏసీడీ నిధులు రూ.70 లక్షలు చొప్పున పురపాలక సంఘాలకు కేటాయించారు. ఈ నిధులతో ట్యాంకర్లు పెట్టి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు కాకుండా శాశ్వత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా పాలనాధికారికి పంపితే ఎన్నికల నియమావళితో అనుమతులు ఇవ్వలేదు. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. వీరికి ఇప్పట్లో నగదు ఇచ్చే అవకాశం లేదు. ఒక్కో పురపాలక సంఘంలో రోజుకు 10 నుంచి 15 ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇదే నిధులతో బావుల తవ్వకం, పాయింట్లు వేసుకునేందుకు అనుమతులు ఇస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే అవకాశముంది. తాత్కాలికంగా ట్యాంకర్లకు నగదు చెల్లించడంలో అక్రమాలు చోటు చేసుకునే అవకాశముంది. ఒక ట్యాంకర్‌ నీరు తోలి రెంటు ట్యాంకర్లకు బిల్లులు పెట్టి స్వాహా చేసే అవకాశముంది. ఇలా గతంలో ఎంతో నగదు స్వాహా చేసిన దాఖలాలు ఉన్నాయి. నాయుడుపేట పురపాలక సంఘంలో శాశ్వత పనులకు ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సాధారణ నిధులు చెల్లించేలా నిర్ణయం తీసుకుని కొత్త పాయింట్లు వేస్తే నాలుగు చోట్ల నీరు అందుబాటులోకి వచ్చింది. ఈ నీటిని పట్టణానికి సరఫరా చేస్తున్నారు. దీంతో కొన్ని ట్యాంకర్లు అద్దెకు పెట్టకుండా నిలిపేశారు.

 

కూర’గాయాల’కు  మందేదీ..? 

Tags: The treasures are empty

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

Date:17/05/2019
ముంబై ముచ్చట్లు:
గురువారం పెరిగిన పసిడి ధర శుక్రవారం మళ్లీ పడిపోయింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.33,170కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం సహా బలహీన అంతర్జాతీయ ట్రెండ్ ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.625 పతనమై రూ.37,625కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర ఔన్స్‌కు 0.04 శాతం తగ్గుదలతో 1,285.65 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం క్షీణతతో 14.46 డాలర్లకు దిగొచ్చింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.33,170కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.33,000కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది.కేజీ వెండి ధర రూ.625 పతనంతో రూ.37,625కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.702 తగ్గుదలతో రూ.36,822కు దిగొచ్చింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,110కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,580కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.39,700కు దిగొచ్చింది .
Tags: Gold, Silver prices are on the rise