70 రూపాయల దిగువకు డాలర్

Date:29/11/2018
ముంబై ముచ్చట్లు:
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బాగా బలపడింది. గురువారం (నవంబరు 29) నాటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ రూ.70.15 వద్ద ప్రారంభమైంది. నిన్నటి ట్రేడింగ్‌లో పోలిస్తే.. నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. తర్వాత మరింత పుంజుకునన్న రూపాయి ఓ దశలో గరిష్ఠంగా 57 పైసలు బలపడి 70.05 వద్దకు చేరింది. నిన్న ట్రేడింగ్‌ చివర్లో రూపాయి 17 పైసలు బలపడి రూ.70.62 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల సమయానిక 69 పైసలు బలపడి 70 దిగువకు చేరి.. 69.93 వద్ద ట్రేడ్ అవుతోంది. గడచిన మూడు నెలల కాలంలో రూపాయి ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి. సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు లక్ష్యం ముగింపు దశకు చేరిందని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమీ పావెల్‌ చేసిన వ్యాఖ్యలతో ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు విలువ బలహీన పడుతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, దేశీయ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా దేశీయ కరెన్సీల విలువ బలపడడానికి దోహదపడుతోందని నిపుణులు అంటున్నారు. రూపాయి బలపడిన నేపథ్యంలో ఈరోజు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Tags:Dollar below 70 rupees

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Date:27/11/2018
ముంబై ముచ్చట్లు:
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారం  స్థిరంగా ఉన్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర 100 పెరిగి రూ.31,750 నుంచి రూ.31,850కి పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం కూడా ఇవే ధరలతో ముగిసింది. ధరలు స్థిరంగా ఉండటంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,850 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,700 వద్దే నిలిచాయి. మరోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడంతో వెండి ధర రూ.150 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.37,450 నుంచి రూ.37,300కి పతనమైంది. వారంతపు డెలివరీ ధరలు రూ.274 తగ్గి పెరిగి రూ.36,035 కి చేరింది.100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే.. లండన్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.1 శాతం తగ్గి 1,222.50 వద్ద ఉండగా.. వెండి ధరలు ఔన్స్‌పై 0.04 శాతం పెరిగి 14.30 డాలర్ల వద్ద నిలిచింది.
Tags:Gold prices are slightly higher

నష్టాల్లోనే మార్కెట్లు

Date:22/11/2018
ముంబై ముచ్చట్లు:
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. అయితే, ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 218 పాయింట్లు పతనమై 34,981కి పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 10,526కు దిగజారింది.
టాప్ గెయినర్స్:
దీపక్ ఫర్టిలైజర్స్ (9.56%), షాపర్స్ స్టాప్ (7.76%), ఐడీఎఫ్సీ బ్యాంక్ (7.71%), క్యాపిటల్ ఫస్ట్ (7.56%), చంబల్ ఫర్టిలైజర్స్ (5.15%).
టాప్ లూజర్స్:
వొడాఫోన్ ఐడియా (-7.43%), పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (-5.08%), కాక్స్ అండ్ కింగ్స్ (-4.56%), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (-4.42%), జైన్ ఇరిగేషన్ (-4.20%).
Tags:Markets in losses

ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

Date:01/11/2018

ముంబై ముచ్చట్లు:

గురువారం ట్రేడింగ్లో దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం 150 పాయింట్లకు పైగా లాభాలతో సెన్సెక్స్. 10,400 పైనా నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభించాయి. రూపాయి బలపడటం, అంతర్జాతీయ  మార్కెట్లు పాజిటివ్ సంకేతాలతో లాభాల్లో సాగాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 100 పాయింట్ల వరకు  నష్టపోయింది. ట్రేడింగ్లో బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్ షేర్లు లాభాలను ఆర్జించగా.. ఐటీ, ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 10 పాయింట్ల నష్టంతో 34431.97 వద్ద ఫ్లాట్గా ముగియగా.. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 10,380 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ మాత్రం 0.8 శాతం లాభంతో 149.80 పాయిట్ల వద్ద ముగిసింది. డాలరుతో  రూపాయి మారకం విలువ 36 పైసలు బలపడి 73.60 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ (+8.48), హిండాల్కో (+3.39), యాక్సిస్ బ్యాంక్ (+3.39) యూపీఎల్ (+3.20),  బీపీసీఎల్ (+3.04) షేర్లు అధిక లాభాలు గడించగా.. హెచ్సీఎల్ టెక్ (-4.42), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (-3.18), టెక్ మహింద్రా (-3.12), భారతీ ఇన్ఫ్రాటెల్ (-2.99), ఇన్ఫోసిస్ (-2.87) షేర్లు  అధికంగా నష్టపోయాయి.

లక్ష కోట్లు దాటిన జీఎస్టీ

Tags:Flat ended markets

లాభాలతో మార్కెట్ల జోష్

Date:24/10/2018
ముంబై ముచ్చట్లు:
వరుస నష్టాల తరువాత దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, కొనుగోళ్లు పెరగడంతో ఉదయం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 34 వేల పాయింట్ల స్థాయికి ఎగబాకింది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా లాభంతో జోరుగా కదలాడింది. ఫైనాన్స్, విద్యుత్‌, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. అయితే కొద్ది సేపట్లోనే ప్రారంభ లాభాలు డీలా పడ్డాయి. మధ్యాహ్నా సమయానికి ఓ దశలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివర్లో సూచీలు పుంజుకోవడంతో మరోసారి నష్టాల బారిన పడకుండా మార్కెట్లు నిలిచాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 186.73 పాయింట్లు లాభపడి 34033.96 వద్ద, నిఫ్టీ 79.95 పాయింట్లు లాభపడి 10224.75 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 38 పైసలు బలపడి 73.19 వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ (10.97), భారతీ ఎయిర్‌టెల్ (10.48), హెచ్‌పీసీఎల్ (6.82), ఐవోసీ (5.81), హిండాల్కో (4.72) షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి. మరోవైపు.. యస్ బ్యాంక్ (-4.32), బజాజ్ ఆటో (-4.31), గ్రాసిమ్ (-2.05), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (-1.59), అదానీ పోర్ట్స్ (-1.52) అధికంగా నష్టాలను చవిచూశాయి.
Tags:Josh of the markets with profits

బులియన్ మార్కెట్లో బంగారం ధరలు  ఈ ఏడాదిలో గరిష్ఠం

Date:24/10/2018
ముంబాయి ముచ్చట్లు:
అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వెత్తడంతో బుధవారం (అక్టోబరు 24) కూడా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం రూ.150 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,500 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,350 గా ఉంది. ఈ ఏడాదిలో బంగారం ధర రూ.32,500 స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మరోవైపు వెండి ధర స్వల్పంగా రూ.20 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.39,730 వద్ద నిలిచింది. 8 గ్రాముల బంగారం ధర రూ.100 రూపాయలు పెరిగి రూ.24,800 స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు పెరిగాయి. సింగపూర్లో ఔన్సు బంగారం ధర 0.11 మేర పెరిగింది. దీంతో అక్కడ బంగారం ధర 1,232.20 అమెరికన్ డాలర్లుగా ఉంది.
Tags:Gold prices are the highest in the bullion market this year

అంతర్జాతీయ సానుకూల పరిణామాలు.. కొనుగోళ్లతో మార్కెట్లకు లాభాలు

Date:24/10/2018
ముంబాయి ముచ్చట్లు:
వరుస నష్టాల తరువాత దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, కొనుగోళ్లు పెరగడంతో ఉదయం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ప్రారంభించింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 34 వేల పాయింట్ల స్థాయికి ఎగబాకింది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా లాభంతో జోరుగా కదలాడింది.
ఫైనాన్స్, విద్యుత్, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. అయితే కొద్ది సేపట్లోనే ప్రారంభ లాభాలు డీలా పడ్డాయి. మధ్యాహ్నా సమయానికి ఓ దశలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివర్లో సూచీలు పుంజుకోవడంతో మరోసారి నష్టాల బారిన పడకుండా మార్కెట్లు నిలిచాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 186.73 పాయింట్లు లాభపడి 34033.96 వద్ద, నిఫ్టీ 79.95 పాయింట్లు లాభపడి 10224.75 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 38 పైసలు బలపడి 73.19 వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి.
బజాజ్ ఫైనాన్స్ (10.97), భారతీ ఎయిర్టెల్ (10.48), హెచ్పీసీఎల్ (6.82), ఐవోసీ (5.81), హిండాల్కో (4.72) షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి. మరోవైపు.. యస్ బ్యాంక్ (-4.32), బజాజ్ ఆటో (-4.31), గ్రాసిమ్ (-2.05), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (-1.59), అదానీ పోర్ట్స్ (-1.52) అధికంగా నష్టాలను చవిచూశాయి.
Tags:International positive consequences .. Benefits to markets with purchases

బులియన్ మార్కెట్లో  పెరిగిన బంగారం, వెండి ధరలు

Date:23/10/2018
ముంబాయి ముచ్చట్లు:
అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వెత్తడంతో మంగళవారం (అక్టోబరు 23) బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం రూ.130 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,350 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,200 గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి రూ.250 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.39,750 వద్ద నిలిచింది.
అంతర్జాతీయంగాను బంగారం ధరలు పెరిగాయి. సౌదీ అరేబియా, పాశ్యాత్య దేశాల్లో నెలకొన్న రాజకీయ వివాదాలు, ఇటలీ బడ్జెట్లోటు, బ్రెక్సిట్ చర్చల ఫలితంగా ఔన్సు బంగారం ధర 0.2 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్సు బంగారం ధర $1,223.66 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లలోనూ బంగారం ధరలు 0.2 శాతం మేర పెరిగాయి. దీంతో అమెరికన్ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర $1,226.5 వద్ద స్థిరపడింది.
Tags; Gold and silver prices rose in the bullion market