బంగారం ధరల్లో పెరుగుదల మార్కెట్ల బేజారు

Date:23/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మంగళవారం కూడా దేశీయమార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో కొనసాగడం మార్కెట్లు భారీ నష్టాలను చవిచూడక తప్పలేదు. మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు, ఆసియా మార్కెట్ల పతనం కూడా దేశీయ మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. వరుసగా రెండో రోజు నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో మిడ్ సెషన్లో అమ్మకాలు పెరిగాయి. ఓ దశలో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల వరకు పతనమైంది. నిఫ్టీ సైతం 123 పాయింట్లు కోల్పోయింది.  అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు ముందున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ట్రేడింగ్లో రియల్టీ షేర్లు స్వల్పంగా పుంజుకోగా.. మిగిలిన అన్ని రంగాలూ ఢీలాపడ్డాయి. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, పీఎస్యూ బ్యాంక్స్, మెటల్, ఆటో రంగాలు అధికంగా నష్టాలను చవిచూశాయి. ప్రపంచ మార్కెట్ల నేలచూపు, దేశీయంగా ఇన్వెస్టర్ల ఆందోళనల నేపథ్యంలో వరుసగా రెండో రోజు అమ్మకాలదే పైచేయిగా నిలిచింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 287.15 పాయింట్ల నష్టంతో 33847.23, నిఫ్టీ 98.45 పాయింట్ల నష్టంతో 10146.8 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 73.57 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది.
ఎన్ఎస్ఈలో.. హెచ్పీసీఎల్ (3.47), ఇండియాబుల్స్ హౌసింగ్ (3.01), హెచ్డీఎఫ్సీ (1.72), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.64), బజాజ్ ఆటో(1.16) షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఆసియా పెయింట్స్ (-5.16), సన్ ఫార్మా (-5.12), విప్రో (-4.07), గ్రాసిమ్ (-3.66), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.45) టాప్ లూజర్లుగా మిగిలాయి.
Tags: Growth in gold prices is marketable

తెలుగుముచ్చట్లు పాఠకులకు వార్షికశుభాకాంక్షలు

Date:17/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌, టివి ఛానల్‌ ప్రారంభించి, ఏడాది గడుస్తున్న సందర్భంగా పాఠకులకు, ప్రకటన దారులకు , సిబ్బందికి వార్షిక శుభాకాంక్షలు. ఎల్లప్పుడు మీ సహకారం ఇలాగే కొనసాగించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

నమస్కారములతో…

యాజమాన్యం.
తెలుగుముచ్చట్లు
(సౌది ఆరేబియా, పుంగనూరు)

మేకిన్ ఇండియాలో భాగంగానే రిలయన్స్ తో ఒప్పందం

Tags:Readership anniversary for readers

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Date:31/07/2018
ముంబై  ముచ్చట్లు:
వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ లాభాల సెంచరీ(112 పాయింట్లు) చేసి 37,606 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37 పాయింట్లు పుంజుకుని 11,356 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. మిడ్ సెషన్‌ నుంచీ మార్కెట్లు నష్టాలను వీడి లాభాల బాటపట్టాయి. సోమవారం అమెరికా, యూరప్‌ మార్కెట్లు నష్టపోగా.. ఆసియాలోనూ ప్రతికూల ట్రెండ్‌ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో 1.6-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.25 శాతం వెనకడుగు వేశాయి. మార్కెట్లు ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో రిల‌య‌న్స్(3.14%), హీరో మోటోకార్ప్(2.77%), హెచ్‌యూఎల్(2.52%), అదానీ పోర్ట్స్(2.41%), టాటా స్టీల్(1.85%), భార‌తీ ఎయిర్టెల్(1.53%) అత్య‌ధికంగా లాభ‌ప‌డ‌గా, మ‌రో వైపు యాక్సిస్ బ్యాంక్(3.23%), హెచ్‌డీఎఫ్‌సీ(1.64%), ఎస్‌బీఐఎన్(1.33%), ఐటీసీ(1.30%), టాటా మోటార్స్(1.13%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి.
లాభాల్లో స్టాక్ మార్కెట్లుhttps://www.telugumuchatlu.com/stock-markets-in-profit-3/
Tags: stock-markets-in-profit-3

నష్టాల్లో మార్కెట్లు

Date:05/06/2018
ముంబై ముచ్చట్లు:
అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి వార్తలతో అంత‌ర్జాతీయ ప‌రిణామాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ డీలాపడ్డాయి. చివ‌ర‌కు ఈ రోజు మార్కెట్లు న‌ష్టాల‌తోనే ముగిశాయి. రిజ‌ర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందున్న అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో ప్రధానంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు ప్ర‌తికూలంగా సాగాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 109 పాయింట్లు క్షీణించి 34,903 వద్ద నిలవగా.. నిఫ్టీ 35 పాయింట్ల వెనకడుగుతో 10,593 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో కేవ‌లం 10 కంపెనీలు మాత్ర‌మే బీఎస్ఈ30లో లాభ‌ప‌డ్డాయి. రిల‌య‌న్స్(0.90%), టాటా స్టీల్(0.88%), హెచ్‌డీఎఫ్‌సీ(0.78%), మారుతి(0.69%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(0.68%) కంపెనీలు లాభ‌ప‌డిన వాటిలో ముందుండగా మ‌రో వైపు కోల్ ఇండియా(2.36%), భార‌తీ ఎయిర్టెల్(2.16%), ఎల్ అండ్ టీ(1.93%), డాక్ట‌ర్ రెడ్డీస్(1.87%), యెస్ బ్యాంక్(1.84%), విప్రో(1.77%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి.
Tags: Markets in distress

 టాప్ పొజిషన్ లో ఎయిర్ టెల్

Date:04/06/2018

ముంబై ముచ్చట్లు:

రిలయెన్స్ జియో ఎన్ని సంచలనాలు సృష్టిస్తూ వినియోగదారులను తనవైపు ఆకర్షిస్తోన్న.. దిగ్గజ టెలికాం సంస్థ ‘ఎయిర్‌టెల్’కే వినియోగదారులు పట్టం కట్టారు. ఈ మేరకు సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా విడుదలచేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఎక్కువమంది కస్టమర్లు ఉన్న నెట్‌వర్క్‌గా నిలవడంతోపాటు, మార్కెట్‌ షేర్‌లోను ఎయిర్‌టెల్‌ తొలి స్థానంలో కొనసాగుతోంది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఎయిర్‌టెల్‌కు 45 లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. దీంతో ఎయిర్‌టెల్ మొత్తం వినియోగదారుల సంఖ్య 308.6 మిలియన్లకు చేరింది. ఎయిర్‌టెల్ తర్వాతి స్థానంలో 222.03 మిలియన్ల కస్టమర్లతో వొడాఫోన్ నిలిచింది. ఏప్రిల్‌ నెలలో వొడాఫోన్‌ 6.6 లక్షల కస్టమర్లను కోల్పోయినప్పటికీ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఇక ఐడియాకు 216.76 మిలియన్లు, ఎయిర్‌సెల్‌ 74.15మిలియన్లు, టెలినార్‌ 37.98మిలియన్లు, ఎంటీఎన్‌ఎల్‌ 3.56 మిలియన్ల మంది యూజర్లు ఉన్నట్లు నివేదికలో తేలింది. మరోవైపు సంచలన టెలికామ్ దిగ్జజం జియో 186.56 మంది చందాదారులతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఐడియా, వొడాఫోన్ విలీనమైతే మాత్రం ఎయిర్‌టెల్ రెండో స్థానానికి పడిపోవాల్సి వస్తుంది. ఇక మార్కెట్‌ షేర్‌లో ఎయిర్‌టెల్‌ 29.41శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. వొడాఫోన్‌ 21.15శాతంతో రెండో స్థానంలో ఉన్నట్లు సీఓఏఐ వెల్లడించింది. ఐడియా 20.65శాతం మార్కెట్‌ షేర్‌తో మూడో స్థానంలో ఉండగా..జియో 17.77శాతంతో తర్వాతి స్థానంలో ఉంది.

 

Tags: Airtel in top position

మరింత పతనం.. 

Date:25/05/2018
మచిలీపట్నం ముచ్చట్లు:
మార్కెట్లో మినుముల ధరర మరింత పతనమయ్యింది. చివరికి ‘ఎవరైనా కొంటే చాలు’ అనే స్థాయికి దిగజారింది. పట్టిసీమ నీటితో పంట పండింది. కొనేవాళ్లు లేక రైతు గుండె మండుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం జల్లెడ పడుతోంది. తెచ్చిన పంట తరిగిపోతోంది. అన్నదాతలను ఆదుకుంటాయనుకున్న అపరాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రతి గింజను కొంటామంటూ ఏర్పాటు చేసిన కేంద్రాలు అలంకారప్రాయంగా మిగులుతున్నాయి. రబీలో వరికి పట్టిసీమ నీళ్లొస్తాయని అందరూ భావించారు. అలా ఇవ్వకపోవడంతో రైతులు అపరాల సాగు చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా 1.53 లక్షల హెక్టార్లలో మినుము పంట సాగయ్యింది. ఉయ్యూరు, విజయవాడ గ్రామీణం లాంటి కొన్ని ప్రాంతాల్లో బోర్లు, నీటి సదుపాయం ఉన్నచోట రబీలో వరి సాగు చేశారు. బందరు, గూడూరు, పెడన తదితర మండలాల్లో  వేరుసెనగ తదితర పంటలు వేశారు. ఎక్కువగా మినుముపై ఆధారపడ్డారు. దిగుబడులు చూసి కలత చెందారు. ఎకరానికి ఎక్కడ చూసినా  4 బస్తాలకు మించి రాలేదు. వచ్చిన పంటను విక్రయించే పనిలో నిమగ్నమయ్యారు. ఎకరానికి రూ.15 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. వచ్చే దిగుబడులతో పోల్చుకుంటే నష్టమే  మిగులుతుందని తెలిపారు.
 అసలే అంతంత మాత్రంగా పండిన పంటను అమ్ముకుందామంటే సరైన ధరలేక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మచిలీపట్నం, పెడన, కొడాలి, పామర్రు తదితర మార్కెట్‌ కమిటీలతోపాటు మోపిదేవి మండలం రాయనవారిపాలెం, కోడూరు మండలం వి.కొత్తపాలెం, గూడూరు మండలం మల్లవోలు సహకార సంఘాలు తదితరాలతో కలిపి మొత్తం 14 కొనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,400 ధరతో కొంటామని చెప్పింది. ‌్ర రైతులు ఇంటి వద్ద జల్లెడ పట్టి కేంద్రాలకు తీసుకువెళుతున్నారు. అక్కడ పలురకాల జల్లెడలు వేయడంతో క్వింటాలుకు 10 కిలోలు  తగ్గిపోతున్నాయని రైతులు తెలిపారు. కేంద్రాలకంటే బయట అమ్ముకోవడమే నయమని భావించి కొందరు వెళ్లడం లేదు.  బయట మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.4,500 ధర పలుకుతోంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళుతున్నారు. నిర్వాహకులు కూడా కొనడానికి వెనుకంజ వేస్తున్నారు.జిల్లాలోని కొన్ని మార్కెట్‌ కమిటీల్లో అధికారులు ఒక్కో రైతు నుంచి రూ.280 తీసుకొని మినుములు కొంటున్నారని ఆరోపణలున్నాయి. మార్కెట్‌ కమిటీల్లోనే కొనేటప్పుడు సహకారసంఘాలకు ఎందుకు అనుమతులివ్వాలని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‌్ర గూడూరు మండలం మల్లవోలు కేంద్రంలో ఇప్పటివరకు 2,177 క్వింటాళ్లు కొన్నారు. ఎగుమతులు లేక 720 క్వింటాళ్లు  గోదాముల్లో మూలుగుతున్నాయి. మిగిలిన సహకార కేంద్రాల్లో కూడా  ఇదే పరిస్థితి. దీంతో అక్కడ కొనుగోళ్లు నిలిపివేసినట్లు అన్నదాతలు వాపోయారు.
మినుము అమ్మినా నగదు సకాలంలో అందడం లేదు. రెండు, మూడు నెలల వరకు నగదు ఖాతాల్లో జమ కావడం లేదు. గోదాముల్లో నిల్వ ఉన్న సరకు ఎప్పుడు అమ్ముతారో.. ఎప్పుడు నగదు జమ చేస్తారో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ కాలం సమీపిస్తోంది. మార్కెట్‌యార్డులు, సహకారసంఘాల్లో జూన్‌ మొదటివారం నుంచి  రైతులకు రుణాలు ఇవ్వడం, విత్తనాలు తెచ్చుకోవడం ఇలా అనేక పనులు ఉంటాయి. అలాంటి సమయంలో  ఎప్పుడు మినుములు అప్పుడు ఎగుమతులు కాకపోతే మరిన్ని ఇబ్బందులు పడాల్సివస్తుంది.
Tags: More fall ..

భారీ లాభాలతో మార్కెట్లు

Date:24/05/2018
ముంబై ముచ్చట్లు:
దేశీయ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ 318.20(0.93%) పాయింట్లు లాభ‌ప‌డి 34,663 వ‌ర‌కూ దూసుకెళ్ల‌గా , మ‌రో సూచీ నిఫ్టీ 83.50(0.80%) పాయింట్లు బ‌ల‌ప‌డి 10,514 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో భార‌తీ ఎయిర్టెల్(4.18%), టీసీఎస్(3.20%), ఇన్ఫోసిస్(3.02%), యాక్సిస్ బ్యాంక్(2.65%), స‌న్ ఫార్మా(2.44%), టాటా స్టీల్(2.36%) భారీ లాభాల‌ను గ‌డించ‌గా, మ‌రో వైపు టాటా మోటార్స్(6.22%), ఓఎన్జీసీ(4.36%), బ‌జాజ్ ఆటో(1.61%), మారుతి(0.73%), యెస్ బ్యాంక్(0.66%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి.
Tags: Markets with huge profits

దిగొచ్చిన బంగారం ధరలు

Date:17/05/2018
ముంబై ముచ్చట్లు:
పసిడి ధరలు భారీగా పడిపోయాయి. బులియన్‌లో 10 గ్రాముల 24 కారెట్ల బంగారం రూ.430 తగ్గింది. రూ.32,020 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో స్వర్ణం విలువ భారీగా పడిపోవడం, స్థానిక నగల వ్యాపారులు బంగారం కొనుగోళ్లపై అనాసక్తి ప్రదర్శించడంతో పసిడి ధరలు తగ్గాయి. ఇక, వెండి కూడా అదే బాటలో పయనించింది. భారీగా పతనమవ్వకపోయినప్పటికీ కిలో వెండిపై రూ.250 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.40,650 వద్ద ఉంది. పరిశ్రమలు, నాణేల తయారీదారులు చాలా తక్కువగా బంగారం, వెండిని కొనుగోలు చేస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక, వెండి నాణేల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 100 నాణేల అమ్మకం ధర రూ.75 వేలు, కొనుగోలు ధర రూ.76 వేల వద్దే స్థిరంగా ఉంది. కాగా, అమెరికా మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1300 డాలర్లకు దిగువకు వచ్చిన నేపథ్యంలోనే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 1290.30 డాలర్ల వద్ద ప్రస్తుతం బంగారం ట్రేడ్ వుతోంది. డాలరు విలువ భారీగా పెరగడం పసిడి ధరలను ప్రభావితం చేసిందంటున్నారు బులియన్ నిపుణులు. ఇక, ఇటు వెండి ధర కూడా ఔన్సుకు 1.52 శాతం తగ్గి 16.24 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Tags: Gold prices