భాల్లో స్టాక్ మార్కెట్లు

Date:11/05/2018
ముంబై ముచ్చట్లు:
కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు చివర్లో జోరందుకున్నాయి. మిడ్ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలు ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలతో తొలి నుంచీ మార్కెట్లు పటిష్టంగానే కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 289 పాయింట్లు జంప్‌చేసి 35,536కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 10,806 వద్ద నిలిచింది.బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఏసియ‌న్ పెయింట్స్(6.17%), టాటా స్టీల్(2.17%), ఎల్ అండ్ టీ(1.69%), యెస్ బ్యాంక్(1.52%), హెఛ్‌డీఎఫ్‌సీ(1.50%), కొట‌క్ బ్యాంక్(1.46%) లాభాల‌తో ముగియ‌గా, మ‌రో వైపు భార‌తీ ఎయిర్టెల్(6.44%), స‌న్ ఫార్మా(5.05%), టాటా మోటార్స్(0.78%), హీరో మోటోకార్ప్(0.74%), ఎన్టీపీసీ(0.36%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి.
Tags: Stock markets in the slopes

క్షీణించిన దేశవృద్ది రేటు

Date:09/05/2018
ముంబయి ముచ్చట్లు:
వస్తు సేవల పన్ను (జీఎస్టీ), కార్పొరేట్‌ అంశాలతో పాటు బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లు బలహీనంగా నమోదు కావడంతో భారత వృద్దిరేటు 2017లో క్షీణించిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఈ ఏడాది 2018లో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా 7.2 శాతానికి చేరుతుందని పేర్కొంది. తాజాగా యూఎన్‌ ఎకనమిక్‌ అండ్‌ షోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఆసియా అండ్‌ ది పసిఫిక్‌ (ఎస్కేప్‌)లో ఆసియా పసిఫిక్‌ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ గురించి నివేదికను రూపుదిద్దింది. భారత జీడీపీ వృద్దిరేటు 2017లో 6.6 శాతానికి దిగివచ్చింది. అంతకు ముందు 2016లో 7.1 శాతం సాధించిందని నివేదికలో వెల్లడించింది. అయితే ఈ ఏడాది 7.2 శాతం, వచ్చే ఏడాది వృద్దిరేటు 7.4 శాతంగా నమోదవుతుందన్న అంచనాను వ్యక్తం చేసింది. ఆసియా పసిఫిక్‌ దేశాల ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందని 2017లో 5.8 శాతం వృద్దిరేటును సాధిస్తే.. అంతకు ముందు ఏడాది 2017లో 5.4 శాతం సాధించిందని పేర్కొంది. అయితే ఈ ఏడాది వచ్చే ఏడాది కూడా వృద్దిరేటు 5.5 శాతంగా ఉంటుందని, చైనా వృద్దిరేటు కాస్తా తగ్గవచ్చునని, అదే సమయంలో భారత్‌లో వృద్దిరేటు నిలకడగా పురోభివృద్ది చెందుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం కార్పొరేట్‌ రంగం జీఎస్‌టికి అలవాటుపడిపోయిందని, ప్రైవేట్‌ పెట్టుబడులు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రభుత్వం మౌలికరంగంపై పెద్దమొత్తంలో వ్యయం చేయడం,అలాగే బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లు మెరుగుపడ్డం తదితర సానుకూల అంశాలకు భారత్‌కు ఉన్నాయని నివేదికలో వివరించింది. పన్ను సంస్కరణలు తీసుకురావడం వల్ల పన్ను వసూళ్లు మెరగుపడ్డాయని దీంతో జీడీపీ వృద్దిరేటుకు 8 శాతం అదనంగా వచ్చి చేరే అవకాశాలున్నాయని వివరించింది. కార్పొరేట్‌, బ్యాంకు బ్యాలెన్స్‌షీట్లు బలహీనంగా నమోదు కావడంతో పెట్టుబడులు మందగిస్తాయని తెలిపింది. వడ్డీరేట్లు తగ్గించినంత మాత్రాన దేశంలోని పెట్టుబడులు రావని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండిబకాయిల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఏడో వేతన కమిషన్‌ సిఫారసులు అమలు చేయడంతో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని యూఎన్‌ అండర్‌ సెక్రటరీ జనరల్‌ షంషాద్‌ అఖ్తర్‌ చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోరందుకోవడంతో పాటు ఉద్యోగావకాశాలు సృష్టించడం కూడా పెద్ద సవాలేనని.. దీంతో పాటు ఆదాయంతో పాటు సంపదలో అసమానతలు పెరుగుతాయని అఖ్తర్‌ వివరించారు.
Tags: Declining national rate of growth

లాభాలతో ముగిశాయి.

Date:09/05/2018
ముంబయి ముచ్చట్లు:
ఇరాన్‌ అణు ఒప్పందానికి అమెరికా కటీఫ్‌ చెప్పడంతో ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. ఉద‌యం కాస్త మంద‌కొడిగా మొద‌లైన ట్రేడింగ్ మ‌ధ్యాహ్నం సెష‌న్ నుంచి జోరందుకుంది. చివ‌ర‌కు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల‌తో స‌రిపెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103 పాయింట్లు బ‌ల‌ప‌డి 35,319 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 23 పాయింట్లు పైకి ఎగ‌బాకి 10,741 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
లాభాల్లో మార్కెట్లు…
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో టాటా మోటార్స్(2.79%), ఏసియ‌న్ పెయింట్స్(1.69%), టీసీఎస్(1.39%), యాక్సిస్ బ్యాంక్(1.36%), యెస్ బ్యాంక్(1.31%), టాటా స్టీల్(1.06%) ఎక్కువ‌గా లాభ‌ప‌డ‌గా, మ‌రో వైపు స‌న్ ఫార్మా(1.02%), ఐసీఐసీఐ బ్యాంక్(0.70%), మారుతి(0.70%), విప్రో(0.66%), ఎం అండ్ ఎం(0.64%), బ‌జాజ్ ఆటో(0.61%) న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.
నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్(2.95%), టైటాన్ కంపెనీ(1.82%), టీసీఎస్(1.4%), యూపీఎల్(1.36%), యెస్ బ్యాంక్(1.33%) లాభ‌ప‌డిన వాటిలో ముందుండ‌గా మ‌రో వైపు అల్ట్రాటెక్ సిమెంట్(2.41%), బీపీసీఎల్(1.82%), లుపిన్(1.64%), స‌న్ ఫార్మా(1.04%), బ‌జాజ్ ఇండ‌స్ట్రీస్(1.03%) అత్య‌ధికంగా న‌ష్టాల‌ను కొనితెచ్చుకున్నాయి.
Tags: Ending with profits.

బడ్జెట్ లో పోలవరానికి భారీగా నిధులు

Date:03/03/2018
విజయవాడ ముచ్చట్లు:
పోలవరం విషయంలో వచ్చే సంవత్సర కాలం, ఎంతో కీలకమైనది… ఇప్పటికే కేంద్ర అనాలోచిత నిర్ణయం వల్ల, మూడు నెలలు అమూల్యమైన సమయం వేస్ట్ అయిపొయింది… చంద్రబాబు ఎలాగోలా సాధించి, నవయుగని తీసుకువచ్చి, కాఫర్ డ్యాంకి పర్మిషన్ లు తీసుకువచ్చి, పనులు ఆగకుండా చేసారు… అయితే, నిధులు విడుదలలో మాత్రం, కేంద్రం తీవ్ర జాప్యం చేస్తుంది… ఇప్పటికే మనం పెట్టిన ఖర్చు, 4 వేల కోట్లు పైన మనకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరం ఏర్పడే ప్రమాదం ఉంది..కేంద్రం, రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అని, మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం, బీజేపీతో పోరాడటం చూస్తున్నాం.. మరో పక్క కేంద్రం, ఏ మాత్రం మన ఆందోళన పట్టించుకోవటం లేదు… దీంతో, ఏ నిమషం అయినా, చంద్రబాబు ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చే వాతావరణం ఉంది… మిత్రపక్షంగా ఉంటేనే, అరాకోరా నిధులతో కేంద్రం విదిలిస్తుంది… అలాంటింది, చంద్రబాబు బయటకు వచ్చేస్తే, పరిస్థితి ఊహించుకోవచ్చు… పోలవరం జాతీయ ప్రాజెక్ట్… కేంద్రం డబ్బులు ఇవ్వాలి అది మన హక్కు… కాని కేంద్రం కావాలని లేట్ చేసిన కొద్దీ, ప్రాజెక్ట్ లేట్ అయిపోతూ ఉంటుంది.. ఎందుకుంటే ఇదే కీలక సమయం.. జూన్ లోపు సాధ్యమైనంత ఎక్కువ పని చెయ్యాలి… వర్షాలు పడటం మొదలైతే, పని సాగదు..అందుకే, ఎటు పోయి, ఎటు వస్తుందో అనే ఉద్దేశంతో, చంద్రబాబు పోలవరం విషయంలో, మొత్తం కేంద్రం పై ఆధార పడకుండా, ప్రాజెక్ట్ పుర్తవటం కోసం, ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌(2018-19)లో సాగునీటి రంగానికి, దాదాపు రూ.24 వేల కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే అత్యధికంగా రూ.13 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి… అంటే, ఒక వేళ కేంద్రం సరైన సమయంలో స్పందించకపోయినా, రాష్ట్రం ముందు ఖర్చు చేసి, తరువాత మన హక్కుగా రావల్సిన డబ్బులు తీసుకుంటుంది… భూపరిహారం, ఎలాగూ 33 వేల కోట్లు కేంద్రమే ఇవ్వాలి… అందుకే ముందుగా ప్రాజెక్ట్ అయినా పూర్తి చెయ్యాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు… ఇప్పుడు కనుక ట్రాక్ తప్పితే, ఇక పోలవరం ఎప్పటికి అవుతుందో చెప్పలేము.. అందుకే, చంద్రబాబు కేంద్రంతో వైరం వచ్చినా, ముందు ప్రాజెక్ట్ ఆగిపోకుండా, ఇబ్బంది లేకుండా ఉండటానికి, ముందు చూపుతో ఆలోచించి, రాష్ట్ర బడ్జెట్ లోనే, పోలవరం ప్రాజెక్ట్ కు 13 వేల కోట్లు కేటాయిస్తున్నారు.
Tags: Budget is heavily funded for the police

మళ్లీ పెరుగుతున్న వడ్డీ రేట్లు

Date:02/03/2018
ముంబై ముచ్చట్లు:
ఎస్బీఐ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన త‌ర్వాత మ‌రో రెండు బ్యాంకులు అదే బాట పట్టాయి. ఐసీఐసీఐ, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ వ‌డ్డీ సైతం అదే త‌ర‌హా నిర్ణ‌యం తీసుకున్నాయి. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో లిక్విడిటీని లేదా న‌గ‌దు ల‌భ్య‌త‌ను క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తున్న క్ర‌మంలో ఎస్బీఐ రిటైల్ డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. మార్చి 1 నుంచి ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌చ్చింది. ఇప్పుడు ఎస్బీఐ లాగే ఐసీఐసీఐ బ్యాంకు, పీఎన్బీ సైతం ఎంసీఎల్ఆర్ వ‌డ్డీ రేట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని 0.15% మేర వ‌డ్డీ రేట్ల‌ను పెంచాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం వ‌చ్చే వారంలో ఇదే త‌ర‌హా నిర్ణ‌యం దిశ‌గా సాగుతుంద‌ని భావిస్తున్నారు.సాధార‌ణంగా బ్యాంకులు గృహ రుణాల విష‌యంలో ఎంసీఎల్ఆర్ ఆధారిత వ‌డ్డీ రేట్ల‌ను అమ‌లు ప‌రుస్తాయి. దీంతో రుణాల‌పై అధిక వ‌డ్డీ రేట్లు అమ‌ల‌వుతుంటాయి. పీఎన్బీ వెల్ల‌డించిన దాని ప్ర‌కారం ఎక్కువ శాతం రుణ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌స్తుతం 8.60%కే తాము గృహ రుణాల‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే మ‌హిళ‌ల విష‌యంలో అయితే ఈ వడ్డీ రేటు 8.55% గా ఉంది.
Tags: Again rising interest rates

క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కళకళ

Date:28/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
షాపింగ్‌లో కొత్త అనుభూతిని అందిస్తోంది క్రౌన్ ఇట్. మొబైల్ యాప్ ద్వారా స్థానిక మార్కెట్‌ని కనెక్ట్ క్రౌన్‌ఇట్ యుటిలిటీస్ ఓచర్ , డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు నగరాల్లో మంచి ఫలితాలు సాధించిన క్రౌన్ ఇట్ తాజాగా హైదరాబాద్, జైపూర్, పుణె, అహ్మదాబాద్, కోల్‌కతా, చండీఘర్ నగరాలకు సేవల్ని విస్తరించింది. ఈ మొబైల్ యాప్ ద్వారా నగరంలో హోటల్స్, సెలూన్, స్పాలో సేవలు పొందవచ్చు. సాధారణంగా వినియోగదారులు ఏ వస్తువు కొనుగోలు చేయదలచినా బేరం చేస్తుంటారు. వీలైంతన తక్కువకు డీల్ కుదుర్చుకునేందుకు యత్నిస్తారు. క్రౌన్ ఇట్ వినియోగదారులకు ఆలోచనకు తగిన సదుపాయాల్ని కల్పిస్తోంది. ప్రతి లావాదేవీ పైనా రాయితీలు అందిస్తోంది. క్రౌన్ ఇట్ యాప్‌లో షాపింగ్స్‌పై బెస్ట్ డీల్స్, డైనింగ్, క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్స్‌ని అందిస్తోంది. స్పా, సెలూన్, హోటల్ బుకింగ్స్, మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ బిల్లుల చెల్లింపుల పై క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. సమీప మర్చెంట్స్‌ను వినియోగదారులతో కనెక్ట్ చేసే వేదిక క్యాష్ బ్యాక్ ఆఫర్లను క్రౌన్స్ రూపంలో అందిస్తుంది. వినియోగదారులు ఆ క్రౌన్స్‌ని ఆన్‌లైన్ షాపింగ్, సినిమా టికెట్స్ బుకింగ్, బిల్లుల చెల్లింపుకు వినియోగించుకోవచ్చు. లైఫ్‌ైస్టెల్ ఓచర్స్, మీల్ కూపన్స్‌ను అందిస్తుంది. ప్రస్తుతం ఎనిమిది నగరాల్లో సేవలందిస్తున్న క్రౌన్ ఇట్ వచ్చే ఏడాదికి 25 నగరాలకు విస్తరించాలనుకుంటోంది.
Tags: Art with Cash Back Offers

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Date:26/02/2018
ముంబై ముచ్చట్లు:
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ట్రేడింగ్లో లాభాలను గడించాయి. ప్ర‌పంచ‌ మార్కెట్ల సానుకూల ప్రభావంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లోనే ఉన్న సూచీలు.. మిడ్ సెషన్ సమయానికి మరింతగా లాభాలను పెంచుకున్నాయి. ఐరోపా మార్కెట్ల సానుకూల ఓపెనింగ్.. మన సూచీలను మరింతగా బ‌ల‌ప‌డేట‌ట్లు చేసింది. దీంతో సోమ‌వారం మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి బీఎస్ఈ సెన్సెక్స్ 303.60 పాయింట్లు పుంజుకుని 34,445.75 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచీ నిఫ్టీ 91.55 పాయింట్లు లాభ‌ప‌డి 10,582.60 వ‌ద్ద స్థిర‌ప‌డింది.నిఫ్టీలో రంగాల వారీగా చూస్తే ఐటీ, టెక్నాలజీ, హెల్త్ కేర్ మినహా.. ఇవాళ అన్ని సెక్టార్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో బయింగ్ జోరుగా కొనసాగింది.బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో స్థిరాస్తి, వాహ‌న‌, మూల‌ధ‌న వ‌స్తువులు, బ్యాంకింగ్, ఫైనాన్స్, చ‌మురు,స‌హ‌జ వాయు రంగాలు రాణించ‌గా మ‌రో వైపు ఐటీ, టెక్నాల‌జీ రంగాలు అమ్మ‌కాల ఒత్తిడి కార‌ణంగా న‌ష్టాల పాల‌య్యాయి.
Tags: Markets ending in profits

మార్చి 8 నే  రాష్ట్ర బడ్జెట్

Date:24/02/2018
విజయవాడ ముచ్చట్లు:
మార్చి 28తో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 29న గవర్నర్‌ విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో 28నే అప్రాప్రియేషన్‌ బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది. అదే రోజు అప్రాప్రియేషన్‌ బిల్లును గవర్నర్‌ ఆమోదానికి పంపిస్తారు. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి కొత్త బడ్జెట్‌ నుంచి నిధుల వ్యయానికి మార్గం సుగమం అవుతుంది.మార్చి 5న ఉదయం 9.30 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఈ మేరకు సమాచార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 6, 7 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ , ఆ చర్చకు సీఎం సమాధానమిస్తారు. మార్చి 8న ఆర్థిక మంత్రి యనమల  బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
Tags: The state budget on March 8th