ఉద్యోగుల సమ్మెతో వ్యాపారమా …

Date:22/05/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
ఉక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో, ఎక్కడైతే దౌర్జన్యం ఉంటుందో అక్కడ కచ్చితంగా తిరుగుబాటు ఉంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు జరిగిన కవాతులో పాల్గొన్న పవన్ కల్యాణ్‌.. అనంతరం కాశిబుగ్గ బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.తిరుగుబాటు చేసిన నేల మన శ్రీకాకుళమని, రక్తం చిందించడానికి కూడా వెనకాడదని అన్నారు. అలాంటి నేల నుంచి మన పోరాటం ప్రారంభించామని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థ కుళ్లిపోతోందని, తనకు ఒక్కటే గుర్తు కొస్తోందని, యువతరానికి ఏ సంపద మిగిల్చారని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. యుద్ధాలు, రక్తాలు, కన్నీరు, కలలు, మోసాలు తప్పా ఏం ఇచ్చారని నలదీశారు. జరుగుతోన్న అన్యాయానికి తాను వ్యతిరేకంగా గళమెత్తానని, దశాబ్దాల పాటు మన పాలకులు చేసిన తప్పులకి మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కుంటున్నామని అన్నారు.జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉద్యోగులతో భేటీ అనంతరం మీడియాకు లేఖను విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఈ లేఖలో.. ఉద్యోగుల సొమ్ముతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుందంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పేరుతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మూలంగా ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు నిరసన తెలిపినా ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. ఉద్యోగులకు అన్యాయం జరిగితే జనసేన చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వారి కుటుంబాలకి ఎదురయ్యే ఇబ్బందులూ తెలుసు. మా నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగే. జీవితం చివరి వరకూ ఆయన ఎప్పుడూ మా మీద ఆధారపడలేదు. తనకు వచ్చే పెన్షన్ మీదే బతికారు. సీపీఎస్ విధానంపై ప్రభుత్వ పెద్దలతో తప్పకుండా మాట్లాడతాను. 30 ఏళ్లు ఉద్యోగం చేశాక ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఆధారంగా ఉంటుంది. ఆ సొమ్ముని షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఏమిటి? ఈ తరహా చట్టం చేసిన నాయకుల పెన్షన్లకి సీపీఎస్ పెట్టలేదంటూ పెన్షన్ విధానంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు జనసేనాని.
TAgs:Business with strike of employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *