బుట్టా రేణుక పేరు తొలగించారు

Butta Renu name is removed

Butta Renu name is removed

Date:17/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని టిడిపికి లేదని వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంటులో ఎపి సమస్యలపై చర్చించాలని టిడిపికి లేదని ఆయన చెప్పారు. అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది టిడిపి,  బిజెపి కుమ్మక్కు నిర్ణయమని ఆయన అన్నారు. బుట్టా రేణుక పార్టీ ఫిరాయించారు. ఆమెను వైసీపీ తరుపున ఎలా పిలుస్తారని ప్రశ్నించాము. దానికి  అన్ని పార్టీ లు నన్ను సమర్దించారు. దీనితో బుట్ట రేణుక పేరును తొలగించారని అయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్  సమస్యలను ప్రధాని ఎదుటే ప్రశ్నించాను. పోలవరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరుగుతోంది.  అసలు దాన్ని ఎందుకు  రాష్ట్రానికి అప్పగించారని అడిగాను. తెలుగు దేశం నేతలు స్వార్ధ ప్రయోజనాల కోసం మాత్రమే పొరాడుతున్నారు. టీడీపీ వారే సభను అడ్డుకుంటామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు వారికి పట్టడం లేదని అయన ఆరోపించారు.
బుట్టా రేణుక పేరు తొలగించారు https://www.telugumuchatlu.com/butta-renu-name-is-removed/
Tags:Butta Renu name is removed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *