Natyam ad

పుంగనూరులో వరి క్వింటాలు రూ.1960లతో కొనుగోలు చేస్తాం – జేడి దొరసాని

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రభుత్వాదేశాల మేరకు వరిక్వింటాలు ధర రూ.1960లతో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని జేడి దొరసాని తెలిపారు. శుక్రవారం ఆమె, సివిల్‌ సఫ్లెయ్స్ డిఎం మోహన్‌ రూరల్‌ మండలంలోని నెక్కుంది గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరిదాన్యం అమ్మదలచిన రైతులు ముందుగా ఆర్‌బికె కేంద్రంలో సంప్రదించాలన్నారు. ఈక్రాప్‌ నమోదు చేసుకున్న రైతుల వద్ద నుంచి వరిదాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులకు వరిదాన్యం కొనుగోలుపై తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో టెక్నికల్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌రెడ్డి , అసిస్టెంట్‌ మేనేజర్‌ మహమ్మద్‌ఇబ్రహిం ,ఏవోలు సంధ్య, సుధాకర్‌, ఏఈవో జయంతి, విఏఏ హరినాయక్‌ , రైతులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Buy quintals of rice in Punganur for Rs.1960 – Jedi Countess