కొనుగోలుదారుల ఆనందాలకు హద్దులేవు- ఎస్‌ఆర్‌వో బాలాజి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రైమ్‌.2.0 ద్వారా కొనుగోలుదారులకు పత్రాలను అప్పటికప్పుడే అందిస్తుండటంతో వారి సంతోషానికి అవదులు లేవని సబ్‌రిజిస్ట్రార్‌ బాలాజి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రైమ్‌.2.0 ను మంగళవారం ప్రారంభించి ఐదు పత్రాలను రిజిస్ట్రర్‌ చేశామన్నారు. తొలిరోజు అలవాటు లేకపోవడంతో ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం 15 పత్రాలను రిజిస్ట్రర్‌ చేశామన్నారు. ఈసందర్భంగా బైరెడ్డిపల్లి మండలం టిఎన్‌.కుప్పం గ్రామానికి చెందిన జయప్రకాష్‌ కొనుగోలు చేసిన భూమి దస్తావేజులను అతనికి సబ్‌రిజిస్ట్రార్‌ అందజేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమం వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రైమ్‌.2.0 అమలు జరుగుతుందన్నారు. 1998 నుండి ఉన్న కార్డు విధానాన్ని మార్పు చేయడం జరిగిందన్నారు. వాటి స్థానంలో వచ్చిన ప్రైమ్‌.2.0 ను డాక్యూమెంటు రైటర్లు అవగాహన చేసుకుంటే ఇంత సులభమైన మార్గం మరోకటి లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిపై బాధ్యత పెరగడంతో పాటు పత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి , ఆమోదించడం ,డాక్యూమెంట్లు కొనుగోలుదారులకు అందజేయడం క్షణాల్లో జరిగిపోతోందన్నారు. కొనుగోలుదారులు, అమ్మకం దారులు అవగాహన కలిగి ఉంటే ప్రైమ్‌.2.0 రిజిస్ట్రర్లు క్షణాల్లో జరుగుతుందన్నారు. ఇక మీదట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పత్రాల కోసం పడి గాపులు కాయాల్సిన అవసరం లేదని తెలిపారు.

నమ్మసక్యంగా లేదు…

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భూమి కొనుగోలు పత్రాలు అప్పటికప్పుడు ఇస్తున్నారంటే నమ్మలేకపోయాం. ఈరోజు తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇలా వేగవంతంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రర్లు, పత్రాలు అందజేసే కార్యక్రమాలు రూపొందించిన ప్రభుత్వానికి మాకృతజ్ఞతలు తెలుపుతునట్లు పి.జయప్రకాష్‌ తెలిపారు.

 

Tags: Buyer’s delight knows no bounds – SRO Balaji

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *