Natyam ad

వందకు కొనుగోలు.. వేలలో అమ్మకాలు

హైదరాబాద్  ముచ్చట్లు:

మట్టి.. కాసుల వర్షం కురిపిస్తుంది. ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రకృతి సంపద కొండలను తవ్వేస్తూ అక్రమంగా రాళ్లు, మట్టిని తరలిస్తున్నారు. ముఖ్యంగా యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిసర ప్రాంతాల్లో సహజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అనుమతులకు మించి తవ్వకాలు జరుపుతున్నారు. అధికారులు పర్యవేక్షణ లోపాన్ని అదునుగా భావించిన మట్టి మాఫియా అక్రమార్కులు ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపి అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. పరిమితులు లేని కొండలను సైతం పిండి చేస్తూ మట్టిని అమ్ముకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.ఇటీవల విస్తరిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి గ్రానెట్, మట్టి అవసరం కావడంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అదును చూసి శివారులో ఉన్న ప్రభుత్వ భూముల్లోని మట్టి తవ్వకాలు జరిపి కొండలను నాశనం చేస్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న చెట్లను కూడా నరికి కలపను కూడా తరలిస్తూ ప్రకృతి సహజ సంపదను దండుకుంటున్నారు. దీంతో యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పరిసర ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.వ్యవసాయ పొలాల్లో చెరువులోకి నీరు వెళ్లేలా మట్టిని తవ్వే టప్పుడు టెక్నికల్ నిబంధనలు పాటించాలి. కానీ ఎవరికి వారు ఇష్టారీతిన మట్టిని తవ్వే క్రమంలో గుంతలు తీస్తున్నారు.

 

 

 

443అనుమతులు తీసుకున్న అంతకుమించి తవ్వుతున్నారు. కొన్నిచోట్ల వెంచర్లలో నుంచి చెరువులోకి నీరు పోకుండా మట్టి తీసుకొచ్చి అడ్డుకట్టగా వేస్తున్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇవన్నీ అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదు. ఇక చెరువులకు వర్షపు నీరందించే వాటిపై అధికారులు దృష్టి పెట్టడం లేదురైతులకు పొలాన్ని చదును చేస్తామని చెప్పి మట్టి కొనుగోలుదారులు రైతుల వద్ద నుంచి ట్రిప్‌కు రూ. 300 వరకు కొనుగోలు చేసి ఇతర చోట్లకు రాత్రి వేళలో భారీగా తరలిస్తున్నారు. డబ్బే ధ్యేయంగా మట్టిని అమ్ముకుంటున్నారు. ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.కొండలు, చెట్లు ప్రకృతి సంపద. వీటిపైనే మానవ మనుగడ ముడిపడి ఉంటుంది. అయితే మనుషులు తమ స్వార్థం కోసం కొండలను తవ్వేస్తూ, చెట్లను నరికేస్తుండడం వలన వన్య ప్రాణులకు ఆవాసం లేకుండా పోతోంది. ఫలితంగా మూగజీవాలు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మరోవైపు చెట్లను నరికేస్తుండడం వల్ల వాతావరణ మార్పులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విలువైన ప్రకృతి సంపదకు నష్టం కలగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

 

Post Midle

Tags: Buying in hundred. Selling in thousands

Post Midle

Leave A Reply

Your email address will not be published.