ఉప ఎన్నిక రిఫ‌రెండ‌మేనా

Date:18/09/2020

తిరుప‌తి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక జరగనుంది. మామూలుగా జరిగే ఉప ఎన్నికకు పెద్దగా చర్చ ఉండదు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఉప ఎన్నికకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార, విపక్షాల సవాళ్లకు సమాధానం చెప్పనుంది ఈ ఉప ఎన్నిక. నిజంగా జగన్ పాలన బాగుంటే ఈ ఉప ఎన్నికలో వైసీపీయే తిరిగి గెలుస్తుంది. వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, చంద్రబాబు పట్ల నమ్మకం ఇంకా ఉంటే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది.తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందారు. ఆయన మృతితో ఇప్పటికిప్పుడు కాకపోయినా మరికొద్దిరోజుల్లోనే తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరగనుంది. ప్రధానంగా అమరావతి రాజధాని అంశం ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ప్రతిబింబించక మానదు. నిజంగా తిరుపతి ప్రాంత ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటే టీడీపీకి జై కొడతారు. ఎందుకంటే ఐదు కోట్లమంది ప్రజలు అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు.అంతేకాకుండా రాజధాని అమరావతి కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనికి వైసీపీ కూడా ప్రతి సవాల్ విసిరింది. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి గెలిస్తే రాజధాని అమరావతిపై నిర్ణయాన్ని పునస్సమీక్షిస్తామని సవాల్ విసిరారు. ఇలా సవాళ్లు విసురుకున్న రెండు పార్టీల నేతలు తర్వాత చప్పపడిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక అనివార్యమయింది.ఈ ఉప ఎన్నిక నిజంగా జగన్ పాలనకు రిఫరెండమనే చెప్పాలి. సహజంగా ఉప ఎన్నిక అంటే అధికారపార్టీకి అడ్వాంటేజీ అవుతుందంటారు. కానీ ఈ ఉప ఎన్నిక పార్లమెంటుకు సంబంధించింది కావడం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటంతో ఈ ఎన్నిక అధికార పార్టీ వన్ సైడ్ గా గెలచుకోవడం అంత ఈజీ కాదు. ఇది జగన్ పాలనకు, చంద్రబాబుపై ఉన్న నమ్మకానికి ఈ ఎన్నిక ఖచ్చితంగా తేల్చనుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 

బాల‌రాజు క‌ల నెర‌వేరుతుందా

Tags:By-election referendum

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *