డిసెంబర్ చివరి నాటికి గోశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి -టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్మాణంలో ఉన్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, నెయ్యి తయారీ కేంద్రం, అగరబత్తుల తయారీ రెండవ యూనిట్ ను డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రాబోయే ఆరు నెలల్లో రోజుకు 2500 లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా కృషి చేయాలని గోశాల అధికారులకు సూచించారు. తిరుమలలో టాటా సంస్థ సహకారంతో జరుగుతున్న మ్యూజియం పనులను వేగవంతం చేయాలని, డిసెంబర్ మొదటి వారం నుంచి వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు. టిటిడి స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని డిపిడబ్ల్యు స్టోరుకు తరలించాలని సూచించారు.అనంతరం న్యాయ విభాగం, అటవీ, రవాణ, డెప్యూటీ ఈఓ జనరల్, ఎస్టేట్, వేద వర్సిటీ, శ్వేత తదితర విభాగాల్లో సంబంధించిన పెండింగ్ అంశాలపై సమీక్షించారు.ఈ సమీక్షలో జెఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఎసిఎఓ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, సీఏవో శేషశైలేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: By the end of December, the development work in Goshala should be completed – TTD EO AV Dharma Reddy
