Natyam ad

పాత సంవత్సరానికి బైబై… నూతన సంవత్సరానికి స్వాగతం

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
పాత సంవత్సరానికి బైబై చెప్పి నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. గత సంవత్సరంలో జరిగిన మంచి గుర్తులను మననం చేసుకుంటూ చేదు సంఘటనలను కొత్త ఏడాదిలో అడుగుపెట్టాం. అయితే 2021 సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా విషాద సంవత్సరమనే చెప్పొచ్చు. ముఖ్యంగా కరోనా మహమ్మారికి చాలా మంది బలయిన ఏడాదిగా పేర్కొనవచ్చు. ఇక భారత్ విషయానికొస్తే కరోనా సెకండ్ వేవ్ విషయంలో కాస్త అలసత్వంగా ఉండడంతో ఎదురుదెబ్బ కొట్టింది.లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అయితే ఎన్నో దు:ఖాలను దిగమింగుకుంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఇండియా ముందడుగు వేసింది. ఇందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ సంవత్సరంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశాన్ని కరోనా నుంచి కాపాడేందుకు ఉచిత కరోనా వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టి చాలా వరకు మహమ్మారి నుంచి తట్టుకునే శక్తిని కల్పించారనే చెప్పొచ్చు. అలాగే ఈ ఏడాదిలో మోదీ తీసుకున్న నిర్ణయాలపై ఒకసారి మననం చేసుకుందాం.
కరోనా సెకండ్ వేవ్ భారత్ ను అతలాకుతలం చేసింది. మొదటి వేవ్ తరువాత కరోనా కేసులు తగ్గడంతో ఇక మహమ్మారి పీడ వదిలిందనే అనుకున్నారు. కానీ అంతలోనే ముప్పు ముంగిటకొచ్చింది. కోట్ల మంది శరీరాల్లోకి ప్రవేశించి.. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే సరైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగింది. కరోనా నుంచి తట్టుకునేందుకు ఇతర దేశాలతో సత్సంబంధాల నేపథ్యంలో కొన్ని వ్యాక్సిన్లు మన దేశంలోకి తీసొకొచ్చారు. మనదేశంలోనూ కోవాగ్జిన్ లాంటి టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు.అయితే అప్పటికే దేశం ఆర్థికంగానూ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రజలు వ్యాక్సిన్ ను డబ్బులు కొనుక్కుని వేసుకునే పరిస్థితి లేదని గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందుగా 40 ఏళ్ల పై బడిన వారికి టీకాలు వేస్తూ వచ్చారు. ఆ తరువాత జూన్ 7న ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సిన్ ప్రకటన చేశారు. ఇక త్వరలో పిల్లలకు కూడా టీకా వేయనున్నట్లు మోదీ తెలిపారు.
 
గత ఏడాదిలో దేశంలో మరో ప్రధాన సమస్య రైతుల ధర్నాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉవ్వెత్తున ధర్నాలు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట వద్ద ఈ ధర్నా ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. ఆ తరువాత యూపీలో కొందరు రైతులపై వాహనాలు వెళ్లడంతో ముగ్గురు రైతులు మరణించారు.దీంతో మోదీ వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గక తప్పలేదు. నవంబర్ 19న వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత పార్లమెంట్ లో రద్దు బిల్లు ఆమోదింప చేశారు. ఏడాది పాటు రైతులు చేసిన ధర్నాకు మోదీ తీసుకున్న నిర్ణయంతో శుభం కార్డు పడింది.
2021లో దేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రధాన మంత్రి మోదీ. 7 రక్షణ వ్యవస్థలను దేశానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. 41 అర్డినెన్స్ ఫ్యాక్టరీలను రీ డిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని 20 ఏళ్లుగా నానుతుందని రానున్న కాలంలో ఈ రక్షణ సంస్థలన్నీ భారత సైనిక బలానికి పెద్ద స్థావరంగా మారనుంది.ఆడపిల్లల వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లు పెంచుతూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు 2021ని ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. నకిలీ ఓటింగ్ ను అరికట్టేందుకు ఓటర్ ఐడీ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలన్న నిర్ణయం కూడా ఈ ఏడాదిలో కీలకంగా చెప్పొచ్చు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Bye bye to the old year … welcome to the new year