Bypassing tasks should be completed immediately

బైపాస్‌రోడ్డు పనులను తక్షణం పూర్తి చేయాలి

– ఎంపీ మిధున్‌రెడ్డి

Date:25/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు బైపాస్‌రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బైపాస్‌రోడ్డు పనులను ఆయన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తో కలసి పరిశీలించారు. తరువాత సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకులో నిల్వ చేస్తున్న నీటిని పరిశీలించారు. అక్కడి నుంచి ఆర్టీడి డీపోకు వెళ్లి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డితో కలసి పనులను పరిశీలించారు. ఎంపీడీవో కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి , జెడ్పిటిసి జ్ఞానప్రసన్న తో కలసి పరిశీలించారు. మండల కాంప్లెక్స్ ను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బైపాస్‌రోడ్డులో పెండింగ్‌ ఉన్న పనులను , కల్వర్టలను తక్షణం పూర్తి చేసి, ఆగస్టులోపు సిద్దం చేయాలన్నారు. అలాగే రైతులు కోర్టులకు వెళ్లడంతో పనులు పెండింగ్‌లో ఉందని ఆర్డీవో మురళి తెలిపారు. దీనిపై రైతులకు ఎక్కువ నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే తాము కూడ రైతులతో మాట్లాడతామన్నారు. రైతులు పనులు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఈయన వెంట డీసీసీబి చైర్మన్‌ రెడ్డెమ్మ, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటీసీ వెంకటరెడ్డి యాదవ్‌, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా పార్టీ కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ పర్యటించారు.

పప్పు దినుసులు వినియోగం

Tags; Bypassing tasks should be completed immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *