ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించిన సి.ఎస్. శాంతి కుమారి

హైదరాబాద్ ముచ్చట్లు:

 

 


రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం  ఏర్పాట్లపై సీ.ఎస్ శాంతి కుమారి  ఆధ్వర్యంలో ఎల్.బి. స్టేడియంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  డీజీపీ రవిగుప్తా, అడిషనల్  డీజి లు సీ.వి.ఆనంద్, శివధర్ రెడ్డి, నగరపోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్యా, ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, రిజ్వి, జలమండలి ఎం.డి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనల్డ్ రోస్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు,  సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, రాజ్ భవన్ కార్యదర్శి సురేంద్రమోహన్ , వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మల్లు రవి, వెం నరేందర్ రెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, శ్రీమతి మున్సీ తదితరులు హాజరయ్యారు.
 

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు, స్టేడియంలో మంచినీటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారని, వారికి ప్రత్యేకంగా గ్యాలరీలతోపాటు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వాహనాల పార్కింగ్, బందోబస్త్ లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.

Post Midle

Tags: C.S. reviewed the arrangements at LB Stadium. Shanti Kumari

Post Midle