ఉద్యోగుల కొత్త పీఆర్సీకి కేబినెట్ ఆమోదం
అమరావతి ముచ్చట్లు:
ఉద్యోగుల కొత్త పీఆర్సీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్నినాని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని
తెలిపారు. ఉద్యోగ సంఘాలకు నచ్చజెప్పేందుకు కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. కమిటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,
మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్నినాని, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ ఉంటారని మంత్రి తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, కరోనా
దృష్ట్యా కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియామకానికి ఆమోదం తెలిపామని పేర్నినాని వివరించారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Cabinet approves new PRC for employees