ఏపి ఉభయసభలలో ఆర్ధిక రంగంపై  కాగ్ నివేదిక

 Date:19/09/2018
అమరావతి ముచ్చట్లు:
బుధవారం నాడు ఉభయసభలలో ఆర్ధిక రంగంపై  కాగ్ నివేదికపూ చర్చ జరిగింది. పోలవరం సహా పలు ఇతర అంశాలపై నివేదికల ప్రస్తావన వచ్చింది. కేంద్ర జలవనరులు సంఘం డిపిఆర్ ను ఆమోదించక ముందే, హెడ్ వర్క్స్ పనులు అప్పగించడంతో ఒప్పందాలు రద్దు అయి ఖర్చు పెరిగి జాప్యం పెరిగిందని  కాగ్ వ్యాఖ్యానించింది. గత 12 సంవత్సరాలలో 1,05,601 ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకుగాను 4,069 కుటుంబాలకు మాత్రమే పునరావాసం  కల్పించారు.
ఇంకా 371 గ్రామాలకుగాను 192 గ్రామల విషయంలో పునర్నిర్మాణ ప్రణాళికను ఖరారు చేయలేదని నివేదిక స్పష్టం చేసింది. ఒరిస్సా, చత్తీస్గఢ్ లో ముంపు నివారించేందుకు నిర్మించాల్సిన రక్షణ కట్టల నిర్మాణంలో పురోగతి లేదు. భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణల మీదా పెట్టిన ఖర్చు వివరాలు వెల్లడించకపోవడం వల్ల 1,408 కోట్లు అందలేదు.
అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడానికి హెడ్ వర్క్స్ కాంట్రాక్టర్ కు 1,854 కోట్లు మీదా రాయితీలకు అనుమతించిన పనులో పురోగతి లేదని కాగ్ వ్యాఖ్యానించింది. విపరీతమైన జాప్యం, మందకొడిగా పనులు జరుగుతున్న కాంట్రాక్టర్ లపై చర్యలు తీసుకోలేదు. పునరావాస పునర్నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వేసిన కమిటీలు నిర్ధేశించినట్లు సమావేశం కాలేదు. అటవి పర్యావరణ అనుమతులకు సంబంధించి నిబంధనలు అమలు జరగడం లేదని కాగ్ పేర్కోంది.
Tags:CAG report on financial sector in both Houses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *