చకచకా గ్రామ పంచాయితీల్లో గణన

Date:19/05/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
పల్లె పోరుకు సంబంధించిన ఏర్పాట్లు వడివడిగా కొనసాగుతున్నాయి.గ్రామ పంచాయతీ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన అధికారులు బీసీ గణన చేపట్టనున్నారు. గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల వివరాలు తయారు చేసి ముద్రించాలని  రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.నిజామాబాద్‌ జిల్లాలో 4,932, కామారెడ్డి జిల్లాలో 4,642 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 200 ఓటర్లు ఉండే పోలింగ్‌ స్టేషన్‌లో ఇద్దరి చొప్పున ఎన్నికల సిబ్బంది ఉంటారు. 201-400 ఓటర్లు ఉంటే ముగ్గురు, 401-650 ఓటర్లు ఉంటే నలుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది పని చేస్తారు. 650 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే రెండో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.  అసెంబ్లీ వారీగా ఉన్న ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ వారీగా చేసి గురువారం తుది జాబితాను ప్రచురించారు. వెనువెంటనే బీసీ ఓటర్ల గణన చేపట్టాలని ఆదేశాలొచ్చాయి.  డీపీవో నుంచి కింది స్థాయి సిబ్బంది రెండ్రోజుల పాటు అదే  పనిలో ఉండనున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగానే ఇప్పటికే పోలింగ్‌ స్టేషన్లను గుర్తించారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.23: పోలింగ్‌ కేంద్రాల జాబితా తయారీ చేయనున్నారు.24న  జాబితా డ్రాప్టు ముద్రణ ,  మండల స్థాయిలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం  25 నుంచి 29 వరకు: అభ్యంతరాల స్వీకరణ  31న: అభ్యంతరాలపై విచారణ జూన్‌ 2న: కలెక్టర్‌ అనుమతి జూన్‌ 4న: పోలింగ్‌ స్టేషన్ల జాబితా ముద్రణచేయనున్నారు.
Tags; Calculation in Chakkacha gram panchayats

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *