పడి పడి లేచేమనసు కలకత్తా షెడ్యూల్ పూర్తి!

Calcutta schedule complete

Calcutta schedule complete

Dat:13/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచే మనసు’ కలకత్తా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  ఈ చిత్ర షూటింగ్ కలకత్తాలో 70 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం నేపాల్ లో కొంత భాగం షూటింగ్ జరుపుకోనుంది.  పడి పడి లేచేమనసు చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ… “ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు కలకత్తా షెడ్యూల్ లో చిత్రీకరించాము. సినిమా బాగా వస్తోంది. డైరెక్టర్ హను రాగవపూడి మాంచి ప్రేమకథతో మీ ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సాయి పల్లవి ఈ సినిమాలో చూడముచ్చటగా కనిపించబోతున్నారు. మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జయకృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు” అన్నారు.నటీనటులు:  శర్వానంద్, సాయి పల్లవి,మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియ రామన్.
పడి పడి లేచేమనసు కలకత్తా షెడ్యూల్ పూర్తి! https://www.telugumuchatlu.com/calcutta-schedule-complete/
Tags:Calcutta schedule complete

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *