అడవి జంతువు దాడిలో దూడ మృతి

రామసముద్రం ముచ్చట్లు:

అడవి జంతువు దాడిలో దూడ మృతి చెందిన సంఘటన రామసముద్రం మండలంలో జరిగింది. మండలంలోని కమ్మవారిపల్లె పంచాయతీ ఎర్రబోయనిపల్లె లో మంగళవారం రాత్రి రైతు వెంకటరమణ పశువుల కొట్టంలో కట్టేసిన దూడను అడవి జంతువు దాడి చేసి చంపేసింది. ఉదయం రైతు పశువుకొట్టంలోకి వెళ్లి చూడగా దూడ శరీరం అంతా పీక్కతినేసి ఉండటంతో మృతి చెంది ఉంది. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చిరుత దాడిలో దూడ మృతి చెందిందని గ్రామస్తులు తెలుపగా హైనా దాడిలో చనిపోయి ఉంటుందని అధికారులు నిర్ధారణ చేశారు. అనంతరం దూడ కు పోస్టుమార్టం నిర్వహించారు.

 

 

కాగా అడవి జంతువులు రాత్రి వేళ గ్రామాల్లోకి వచ్చి మూగజీవాలను చంపేస్తుంటే ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. రాత్రి వేళ ఆరుబయట , పొలాలవద్ద నిద్రించే గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు నెలల క్రితం మండలంలోని దాసార్లపల్లె వద్ద పొలంలో ఉన్న ఆవును నూరు మీటర్ల దూరం లాక్కెళ్లి అడవి జంతువు చంపేసింది. కానీ కొంతమంది రైతులు తమ పొలాల వద్ద చిరుత సంచరిస్తున్నట్లు అటవీ అధికారులకు చెప్పినా పట్టించుకోకుండ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికయినా అటవీశాఖ అధికారులు చిరుత సంచార ప్రాంతాలలో నిఘా పెట్టి వాస్తవ పరిస్థితులను కనిపెట్టి భవిష్యత్తు లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags: Calf killed in wild animal attack

Leave A Reply

Your email address will not be published.