అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1912 నంబర్ కు కాల్ చేస్తే కనెక్షను మంజూరు చేసే పద్ధతిని తీసుకొచ్చింది. తొలుత APEPDCL పరిధిలో శ్రీకారం చుట్టింది. త్వరలో రాష్ట్రమంతా అమలు చేయనుంది. ఆ నంబర్కు కాల్ చేసి భూమి ఖాతా సంఖ్య, సర్వే నంబర్ చెబితే వెబ్ ల్యాండ్ లో వివరాలను సరిచూసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.
Tags: Call 1912 for agricultural electricity connection