Natyam ad

పుంగనూరులో 44 కార్మిక చట్టాల కోసం ఉధ్యమం

పుంగనూరు ముచ్చట్లు:

దేశ వ్యాప్తంగా 44 కార్మిక చట్టాల అమలు కోసం ఉధ్యమం చేపట్టినట్లు సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి టి.జనార్ధన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మున్సిపల్‌ కార్మికులతో కలసి ఏఐటియుసి జెండా ఎగురవేసి ఆవర్భావ దినోత్సవం నిర్వహించారు. జనార్ధన్‌ మాట్లాడుతూ దేశంలోని 44 కార్మిక చట్టాలను కుదించాలని ప్రభుత్వం కుటిలయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ చట్టాల జోలికి వస్తే పార్లమెంటు ఎన్నికల్లో కార్మికులే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. కార్మికులకు సమానవేతనం ఇవ్వకుండ వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి, రెడ్డిశేఖర్‌, రెడ్డెప్ప, సుమన్‌, శివశంకర్‌, పార్వతమ్మ, రెడ్డెమ్మ, నారాయణ, చంద్ర, ఈశ్వరమ్మ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Campaign for 44 labor laws in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.