ప్రచార హోరు  

Date:08/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
గులాబి అధినేత కేసీఆర్ ప్ర‌చారంలో దూసుకుపోయేందుకు రంగం సిద్దం చేశారు. మ‌హ‌కూట‌మి అభ్య‌ర్థులు ప్ర‌క‌టించినా…ప్ర‌క‌టించ‌కున్నా..వ‌చ్చే సోమ‌వారం నుంచి ఎన్నిక‌ల క్షేత్రంలో దిగ‌బోతున్నారు. దీనికి సంబందించిన షెడ్యూల్డ్ రెండురోజుల్లో ఫైన‌ల్ అవ్వ‌బోతుంది.
ఈ నెల 11 న 12నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించడంతో పాటూ అదేరోజు బీ-ఫామ్ లు సైతం అంద‌జేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. తెలంగాణ‌లో మ‌హ‌కూట‌మి అభ్య‌ర్థులు ప్ర‌చారంలోకి దిగ‌క‌ముందే ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి కేసీఆర్ ప్ర‌త్య‌క్షంగా దిగ‌బోతున్నారు. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ప్ర‌చార శైలికి సంబందించి రిపోర్ట్ లు తెప్పించుకున్న కేసీఆర్…100నియోజ‌క‌వ‌ర్గాల గెలుపు పై ప్ర‌త్యేక వ్యూహాల‌ను ర‌చించారు.
ఇంత‌కాలం మ‌హాకూట‌మి అభ్య‌ర్థుల లిస్ట్ కోసం ఎదురుచూసిన కేసీఆర్…స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో …ప్ర‌త్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌ది తెలియ‌కున్నా…టీఆర్ఎస్ మాత్రం ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చెయ్యాల‌ని భావించారు. ఇందుకోసం ఈ నెల 12నుంచి నేరుగా కార్య‌చ‌ర‌ణ అమ‌లు చెయ్య‌బోతున్నారు కేసీఆర్.
ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా నెల‌రోజులు గ‌డువు ఉండ‌టం…ఈ నెల 12నే నోటిఫికేష‌న్ వ‌స్తుండ‌టంతో ఇక అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కేసీఆర్ ప్ర‌చారం నిర్వ‌హించేందుకు కార్య‌చ‌ర‌ణ సిద్దమవుతుంది. ముందుగా..పార్టీని భ‌లోపేతం చెయ్యాల‌నుకున్న ఖ‌మ్మం జిల్లాపై కేసీఆర్ దృష్టిపెట్టారు. ఖ‌మ్మం లో భ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌డంతో పాటూ…
క‌రీనంగ‌ర్,వ‌రంగ‌ల్ జిల్లాల్లో సైతం ప్ర‌తిప‌క్షాలు ఆశ్చ‌ర్య‌పోయేలా స‌భ‌లు నిర్వ‌హించేందుకు కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న చేశారు. భారి భ‌హిరంగ స‌భ‌ల అనంతరం ఇక ఎక్కడా గ్యాప్ లేకుండా…నియోజ‌క‌వ‌ర్గాల వారిగా స‌భ‌లు…వాటి మ‌ద్య‌లో రోడ్ షోలు నిర్వ‌హించేందుకు రోడ్ మ్యాప్ సిద్దం చేశారు.
ప్ర‌చార ప‌ర్వంలో దిగే ముందు అభ్య‌ర్థుల‌కు పార్టీ త‌రుపున అందించాల్సిన ప‌నుల‌న్ని వ‌చ్చే ఆదివారంలోపు పూర్తిచెయ్య‌బోతున్నారు.
పార్టీ ప్ర‌క‌టించ‌ని 12నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా గెలుపు గుర్రాల‌ను భ‌రిలోకి దింప‌బోతున్నారు కేసీఆర్. న‌ల్లొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కి కంచుకోట‌లా ఉన్న స్థానాలను ఈసారి టీఆర్ఎస్ ఖాతాలో వేసుకొనేందుకు అభ్య‌ర్థుల లిస్ట్ ఇప్ప‌టికే ఖరార‌యిన‌ట్లు స‌మాచారం. ఆ అభ్య‌ర్థుల‌కు స్వ‌యానా సీఎం కేసీఆర్ ఫోన్ చేసి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో పాటూ…సీటు ఇస్తున్న‌ట్లు చెప్పిన‌ట్లు చ‌ర్చ జ‌ర‌గుతోంది. ఇందులో బాగంగానే హైద‌రాబాద్ లోని బీజేపి సిట్టింగ్ స్థానాల్లో పార్టీనుంచి కీల‌క వ్య‌క్తుల‌ను రంగంలోకి దింప‌బోతున్నారు.
కిష‌న్ రెడ్డి ప్రాతినిద్యం వ‌హిస్తున్న అంబ‌ర్ పేట‌…బీజేపి అద్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ప్ర‌తినిద్యం వ‌హిస్తున్న ముషీరాబాద్…రాజాసింగ్ ప్రాతినిద్యం వ‌హిస్తున్న గోషామ‌హ‌ల్,  చింత‌ల రామ చంద్రారెడ్డి ప్ర‌తినిద్యం వ‌హిస్తున్న ఖైర‌తాబాద్ నియోజ‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రాల‌ను ఇప్ప‌టికే కేసీఆర్ ఫైన‌ల్ చేశారు. ఇక ఎన్వీఎస్ ప్ర‌భాక‌ర్ ప్ర‌తినిద్యం వ‌హిస్తున్న ఉప్ప‌ల్ లో పార్టీ అభ్య‌ర్థి భేతి సుభాస్ రెడ్డి గెలిచేందుకు స్వ‌యంగా కేటీఆర్ ను రంగంలోకి దింపారు. దీంతో తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం అనేది ఉండ‌కుండా…ప్ర‌జ‌లంతా టీఆర్ఎస్ పాల‌న కోరుకుంటున్నార‌న్న మెసేజ్ దేశ రాజ‌కీయాల్లో చూపేందుకు కేసీఆర్ సిద్ద మ‌య్యారు.
మొత్తంగా ఈనెల 11న 119నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌కు తెలంగాణ భ‌వ‌న్ లో స‌మావేశం ఏర్పాటు చేసి బీ- ఫామ్ లు ఇచ్చేందుకు రంగం సిద్దంచేసిన‌ట్లు స‌మాచారం. అదేరోజు కేసీఆర్ ప్ర‌చార షెడ్యూల్ కూడ విడుద‌ల్యే అవకాశం క‌నిపిస్తోంది. అయితే దాదాపు 40స్థానాల్లో అభ్య‌ర్థుల మార్పు చేప‌ట్టాల‌ని భావించిన సీఎం కేసీఆర్..ఈ స‌మ‌యంలో అభ్య‌ర్థుల‌ను మార్చితే కొత్త‌రకం త‌ల‌నొప్పులు వ‌స్తాయ‌ని…ప్ర‌జ‌లంతా కేసీఆర్ న్యాయ‌క‌త్వం కోరుకుంటున్న‌ప్పుడు…
అభ్య‌ర్థుల మీద వ్య‌తిరేక‌త ఉన్నా..ప్ర‌చారంలో వాటిని తుడిచేసేందుకు కేసీఆర్ ప్ర‌త్య‌క శ్ర‌ద్ద తీసుకుంటున్న‌ట్లు సమాచారం. అందుకే ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులంద‌రికి బీ-ఫామ్ లు ఇవ్వాల‌ని కేసీఆర్ తాజాగా నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. మంగ‌ళ‌వారం మంత్రి కేటీఆర్ మీడియాతో జ‌రిపిన చిట్ చాట్ లో సైతం అభ్య‌ర్థుల మార్పు ఉండ‌ద‌ని…
అంద‌నికి బీ-ఫామ్ లు ఇస్తున్న‌ట్లు చెప్ప‌డంతో ప్ర‌జావ్య‌తిరేక‌త ఉన్న అభ్య‌ర్థులు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తంగా ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలోకి ఇక కేసీఆర్ సోమ‌వారంనుంచి రంగంలోకి దిగోతున్నారు. 2014లో ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ తో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించిన కేసీఆర్…63స్థానాలు ద‌క్కించుకోగా…ఈసారి ఆయ‌న వ్యూహాలు ఎంత‌వ‌ర‌కు ఫలిస్తాయో ఎద‌రుచూడాల్సిందే మ‌రి.
Tags: Campaign Title

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *