దివ్యాంగులకోసం శిబిరాలు

Camps for Divines

Camps for Divines

Date:22/11/2019

భీమవరం ముచ్చట్లు:

జిల్లాలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించే ఎంపిక శిబిరాలను అర్హులైన వారంతా పేర్లను నమోదు చేసుకోవాలని ప్రయోజనం పొందాలని భీమవరం శాసనసభ్యులు  గ్రంధి శ్రీనివాస్ చెప్పారు. భీమవరం జూపూడి కేశవరావు హైస్కూల్ లో శుక్రవారం శారీరక దివ్యాంగులకు ట్రైసైకిళ్లు కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటుచేసిన శిబిరాన్ని శాసనసభ్యులు  గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సహాయ సం స్థ అందిస్తున్న ఉపకరణాలు మూడు చక్రాల సైకిళ్లు, రెండుచక్రాల తోపుడు కుర్చీలు, చంకకర్రలు, చేతికర్రలు, కాలిపర్స్, కృత్రిమ అవయవాలు వంటివే కాకుండా మూడు చక్రాల బ్యాటరీ మోటార్ సైకిల్స్ ఇవ్వనున్నటు ఆయన చెప్పారు. అందుకోసం అర్హులైన దివ్యాంగుల తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సౌకర్యాలన్ని అర్హులైన లబ్దిదారులు అందిపుచ్చుకుని సుఖంగా జీవించాలని అన్నారు. జిల్లా కలెక్టర్  రేవు ముత్యాల రాజు మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న ఈ ఎంపిక శిబిరాలు విభిన్న ప్రతిభావంతులు ఉపయోగించుకునేలా అవసరమైన ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమీషనర్లు వారి పరిధిలో వున్న పంచాయతీ కార్యదర్శులు, మెప్మా సిబ్బంది , సచివాలయ సిబ్బందితోపాటు గ్రామ,వార్దు వాలంటీర్లకు ఈ శిబిరాల ప్రాముఖ్యాన్ని తెలియచేయాలని, వారి ద్వారా అర్హులైన దివ్యాంగులు శిబిరాలకు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఆర్దిక సంవత్సరంలో రు .1.85 కోట్ల విలువచేసే 500 బ్యాటరీ మోటార్ సైకిళ్లను అందచేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విభిన్నప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు  వి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

 

నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యత

 

Tags:Camps for Divines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *