మార్కెట్ లలో సీసీ కెమెరాలు

Date:14/04/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
మార్కెట్‌ యార్డుల్లో తరచూ గొడవలు, ఆందోళనల దృష్ట్యా ఇక వాటిని అరికట్టేందుకు ప్రత్యక్ష చర్యలు తీసుకోబతున్నారు. ప్రతి మార్కెట్‌ యార్డులో సీసీకెమారాలు ఏర్పాటు చేయానున్నారు. శనగ కొనుగోళ్లకు లక్ష్యం నిర్దేశించిన దరిమిలా ఈ చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక రైతు నుంచి 20 క్విటాళ్లు మాత్రమే కోనుగోలు చేయాలన్నారు. షెడ్యుల్‌ ప్రకారం రైతులు గ్రామాల వారిగా వీఆర్‌ఓ, ఏఈఓలు కూపన్లు జారికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పట్టాపాస్‌ పుస్తకం, ఆధార్‌ జిరాక్స్‌ కాపీలు, వీఆర్‌ఒ ద్రువీకరణ పత్రాలు తప్పని సరిగా వెంట తీసుక రావాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా హెల్ప్‌లైన్‌ 1800-120-3244కు ఫోన్‌చేయాలన్నారు.రైతుల సమస్యలు పరిష్కరించడానికి జిల్లా కేంద్రంలో కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి సోమవారం కిసాన్‌ మిత్ర ద్వారా దరఖాస్తులను అందజేయాలన్నారు.  ప్రభుత్వం రైతులకు ఆసరాగా నిలుస్తుందన్నారు. బోథ్‌ వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో శనగలు, మొక్కజొన్నలను మరో రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఇకపోతే అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు.  అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వ పథకాల అమలు, సమస్యల పరిష్కారంపై సవిూక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.గ్రామాల్లో ప్రధానంగా నీటి సమస్య తలెత్తకుండా ఉండడానికి సంబంధిత ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌,పంచాయతీ అధికారులతో కలిసి సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలని అన్నారు. ఇందుకోసం 14వ ఆర్థిక సంఘం నిధులను వాడుకోవచ్చని చెప్పారు. అత్యవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని, అలాంటివి తలెత్తకుండా ఉండాలంటే గ్రామ స్థాయిలో ఒకరి వద్ద నుంచి సమస్యలపై సమాచారం అందేలా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు.  గ్రామాల్లో పనిచేసే అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు గ్రామంలో 50 మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలను ప్రోత్సహిస్తే వారికి పారితోషకంగా రూ.2,500 పొందవచ్చన్నారు. కొంతమంది మరుగుదొడ్లకు స్థలం లేదని అంటున్నారని, అలాంటి వారికి గ్రామ సవిూపంలోని ప్రభుత్వం భూమిలో సామూహికంగా నిర్మించుకునేలా చూడాలన్నారు. ఉపాధిహావిూ పథకంలో డబ్బులు రాలేదన్నది వాస్తవమేనని, డబ్బులు తప్పకుండా వస్తాయని, అందులో అనుమానం వద్దన్నారు.
Tags: Cams cameras in markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *