కల్యాణ లక్ష్మి కరుణించదా..? 

Date:22/07/2019

ఆదిలాబాద్ ముచ్చట్లు:

 

ప్రభుత్వ నిర్లక్ష్యం వేలాది మందిని అప్పుల్లోకి నెట్టింది. ప్రభుత్వ సహాయం అందుతుందన్న భరోసాతో అప్పు చేసి ఆడకూతుళ్ల పెళ్లి చేసిన కుటుంబాలకు నెలలుగా నిరీక్షణ తప్పడం లేదు. మొన్నటివరకు ఎన్నికల కోడ్‌ సాకు చెబుతూ వచ్చిన అధికార యంత్రాంగానికి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియని అయోమయం వెంటాడుతోంది. రేపో, మాపో చెక్కులు ఇస్తామని చెబుతున్నారో తప్ప ఎప్పుడు ఇస్తారో తెలియక బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

 

 

జిల్లాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1372 కుటుంబాలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం పేద కుటుంబాల అండగా నిలబడాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమలుచేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కల్యాణ లక్ష్మి, మైనార్టీలకు షాదీముబారక్‌ పేరిట ఆయా వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,00116 ఆర్థిక సహాయం చేస్తోంది. తొలుత ఈ పథకం కింద రూ.51వేలు ఇచ్చేవారు. రాను రాను ఆ సహాయాన్ని పెంచుతూ వస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తోంది. నిరుపేద కుటుంబాల వారు పెళ్లికి అప్పులు చేయాల్సిన పరిస్థితి లేకుండా చేశాయి ఈ పథకాలు.

 

 

 

 

పథకాల అమలుతో బాల్య వివాహాలు తగ్గాయి. పథకం కోసం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు తప్పనిసరి చేయడంతో వాటికి చట్టబద్ధత చేకూరుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకాల అమలుకు నిధుల కొరత ఆయా కుటుంబాలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పలు సందర్భాల్లో పెళ్లి రోజున చెక్కులు అందజేసిన రోజులు ఉండగా.. మరికొందరికి పెళ్లయిన నెలరోజుల్లోగా నగదు చేతికందని సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసీజన్‌లో పెళ్లిళ్లు చేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అందడంలో తీవ్ర జాప్యమవుతోంది.
నవంబరు నుంచి జూన్‌ 10వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఆ సమయంలో పెళ్లిళ్లు చేసుకున్న వారికి సహాయం అందకుండా పోయింది.

 

 

 

 

జూన్‌ మాసంలో కోడ్‌ ఎత్తివేసినా రెవెన్యూ యంత్రాంగం వేరే పనుల్లో నిమగ్నం కావడంతో దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ ఆలస్యమైంది. తీరా అన్ని ముగిసాక ఇపుడు నిధులు కొరత ఆయా కుటుంబాలకు శాపంగా మారింది. ఇటీవల అధికారులు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాలను చేపడుతున్నా మెజార్టీ కుటుంబాల వారికి చెక్కులు పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

 

 

 

జిల్లా వ్యాప్తంగా 14,792 కుటుంబాలు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోగా.. అందులో 13,420 మందికి ఆర్థిక సహాయం అందించినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎస్టీ, బీసీ వర్గాలకు సరిపడా నిధులు లేక తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తుల ఆమోదం పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే..

 

 

 

 

ఆ దరఖాస్తుకు తొలుత తహసీల్దారు, ఆతర్వాత ఆర్డీవో ఆమోదం తెలిపాక ఎమ్మెల్యే సైతం తన అంగీకారం తెలపాల్సి ఉంటుంది. విచారణ పేరిట తహసీల్దార్‌ కార్యాలయాల్లో అత్యధికంగా.. ఆ తర్వాత ఆర్డీవోల వద్ధ. మరికొన్ని ఎమ్మెల్యే వద్ద ఆమోదం తీసుకోవడంలోనూ లబ్ధిదారులకు సరైన సమయంలో ఆర్థిక సహాయం అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

 

 

 

 

కొందరు ఎమ్మెల్యేలు ఉదారంగా వ్యవహరిస్తూ తహసీల్దారులను స్థానిక నేతలతో కలిసి చెక్కులు ఇచ్చుకోవాలని పురమాయిస్తుంటే.. మరికొందరు మాత్రం తామే ఇస్తామంటూ పట్టుబడుతుండటం కూడా చెక్కుల పంపిణీలో ఆలస్యమవుతోందని ఆయావర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమైతే అందుబాటులో ఉన్న నిధుల మేరకు చెక్కుల పంపిణీ జరుగుతున్నా.. నిధుల లేమితో చాలామంది సర్కారు సాయం కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.

రొయ్యకు రూల్స్ లేవ్. 

Tags: Can Kalyana Lakshmi be kind?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *