లోకేష్ పంటలను గుర్తిస్తాడా ?
నెల్లూరు ముచ్చట్లు:
వ్యవసాయ శాఖపై అవగాహన లేకుండా పిచ్చి రాతలు రాస్తున్నారు. టీడీపీ హయాంలో వ్యవసాయం, ప్రస్తుత ప్రభుత్వం లో వ్యవసాయం ఎలా ఉందో చూడండని మంత్రి కాకిణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హయంలో రాష్ట్రం కరువు విలయతాండవం ఆడింది. వందల సంఖ్యలో కరువు మండలాలను ప్రకటించే వారు. వైసీపీ హయాంలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదు. టీడీపీ హయాంలో పశువులు కూడా పశుగ్రాసం లేకుండా చనిపోయిన దుస్థితి వుండేది. బడ్జెట్ అంటే అవగాహన కూడా లేకుండా పచ్చ పత్రికలు వార్తలు రాస్తున్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వం రైతులని అన్ని విధాలా ఆదుకుంటుంది. వంద జన్మలెత్తినా చంద్రబాబు రైతు భరోసా కేంద్రం లాంటివి తీసుకురాగలడా. రాష్ట్రంలో 13 నుంచి 14 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి పెరిగింది, ఇది వదిలేసి క్రాప్ హాలీడ్ అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. జీఓకి జియోకి తేడా తెలీకుండా లోకేష్ మాట్లాడుతున్నాడు. లోకేష్ కి ఐదు పంటలు చూపిస్తా… వాటిల్ని గుర్తుపట్టగలడా. పప్పు అని పిలిచే లోకేష్ కి కందిపప్పు, పెసలపప్పు పంట చూపిస్తా… వాటిని గుర్తుపట్టగలడా అని ప్రశ్నించారు.
Tags: Can Lokesh identify crops?

