మజ్లీస్ అనుకున్నది సాధిస్తారా..

Date:30/11/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాద్ -ఉల్ – ముస్లిమీన్ (ఏఐ ఎంఐఎం) ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ మజ్లిస్ పార్టీ పేరు అందరికీ సుపరిచితం. గత కొన్ని దశాబ్దాలుగా ఈ పార్టీ హైదరాబాద్ నగరంతో మమేకమైంది. నగర పాలక సంస్థ ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్ని ఎన్నికలు జరిగినా, ఎవరు బరిలో ఉన్నా, ఏ పార్టీ రాష్ర్టంలో అధికారంలో ఉన్నా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మజ్లిస్ దే. ఇందులో మరో మాటకు తావు లేదు. నగరంలోని కొన్ని కీలక అసెంబ్లీ నియోజకవర్గాలూ ఆ పార్టీవే. నగరానికే పరిమితమైన పార్టీ అని విమర్శలు గుప్పించే పార్టీలు ఇప్పుడు మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న తీరు చూసి ఆశ్ఛర్యానికి, ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ ఏకంగా అయిదు స్థానాలను గెలుచుకుని ఎంఐఎం తన సత్తా చాటింది. అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు సవాల్ విసిరింది. సీమాంచల్ ప్రాంతంలోని అమౌర్, కొచాధమన్, జోకీహట్, బైసీ, బహదుర్ గంజ్ నియోజకవర్గాల్లో విజయ పతాకాన్ని ఎగురవేసింది. మొత్తం 24 స్థానాలకు పోటీచేసిన ‘పతంగి’ పార్టీ అయిదింటిలో విజయ దుందుభి మోగించింది. పతంగి ఎంఐఎం పార్టీ గుర్తు. ముస్లిములు అత్యధికంగా ఉన్న అరరియా, క్రిష్ణగంజ్, పూర్ణియా, కటిహార్ ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. ముస్లింల ఓట్లను చీల్చి పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి మేలు చేసే ఉద్దేశంతో మజ్లిస్ బరిలోకి దిగిందని, అంతేతప్ప పార్టీకి ప్రజల్లో బలం లేదన్న విమర్శలు వినిపించాయి.

 

 

కానీ అయిదు సీట్లలో విజయ కేతనం ఎగుర వేయడం ద్వారా విమర్శలకుల నోళ్లు మూయించింది.విస్తరణ కోసం ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ బిహార్ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు అక్తారుల్ తో కలిసి వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. గతేడాది అక్టోబరులో బిహార్ లో జరిగిన కిషన్ గంజ్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పార్టీ పోటీలోకి దిగింది. పార్టీ అభ్యర్థి ఖమ్రుల్ హుడా ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో పార్టీని మరింత విస్తరించాలని భావించి మొన్నటి ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అయిదుగురు నాయకులు ఇటీవల హైదరాబాద్ వచ్చి పార్టీ అధినేత ఒవైసీని కలిశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ర్టలో అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. నాటి ఎన్నికల్లో ఔరంగాబాద్ స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. బిహార్ విజయస్ఫూర్తితో వచ్చే ఏడాది బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒవైసీ వ్యూహరచన చేస్తున్నారు.బెంగాల్ లో దాదాపు 30 శాతం మంది ముస్లింలు ఉన్నట్లు అంచనా. వీరిలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలు కూడా ఉన్నారు.

 

 

 

కోల్ కతా నగరం, ముర్షీదాబాద్, ఉత్తర దీనాజ్ పూర్, దక్షిణ దీనాజ్ పూర్, డైమండ్ హార్బర్ జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువ. బీజేపీతో పాటు అధికార టీఎంసీ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి తమ బలం చూపిస్తామని మజ్లిస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అసిమ్ వకార్ వెల్లడించారు. 1927 నవంబరు 12న ఆవిర్భవించిన మజ్లిస్ అంచలంచెలుగా ఎదిగింది. ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వరుసగా 1984 నుంచి 2004 వరకు హైదరాబాద్ ఎంపీగా కొనసాగారు. 2004 నుంచి ఆయన కుమారుడు ప్రస్తుత పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగాకొనసాగుతున్నారు. దీనిని బట్టి వారికి గల ప్రజాభిమానం ఏపాటితో అర్థం అవుతుంది. తొలి రోజుల్లో పార్టీ తరఫున అల్లంపల్లి పోచయ్య, కె.ప్రకాశ్ రావు, ఎ. సత్యనారాయణ నగర మేయర్లుగా పని చేశారు. అందరూ విమర్శిస్తున్నట్లు తమది మతతత్వ పార్టీ కాదని, అలా అయితే ముగ్గురు హిందువులను మేయర్లుగా ఎలా ఎంపిక చేస్తామన్న ప్రశ్న పార్టీ నుంచి వినిపిస్తోంది. దీనిని తోసిపుచ్చలేం. ప్రస్తుత డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ మజ్లిస్ నాయకుడే. తాము హిందువులకు వ్యతిరేకం కాదని, బీజేపీ ప్రవచిత హిందూత్వకే వ్యతిరేకమని, తమ వాదనలోని సహేతుకతను గమనించబట్టే ప్రజలు తమను ఆదరిస్తున్నారని, మున్ముందు మరింత ప్రజాదరణ చూరగొంటామని ఎంఐఎం ధీమాగా

మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం

Tags: Can the Majlis achieve what it wants ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *