Natyam ad

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రధాని మోదీతో చెప్పించగలరా..?

– బాబు, కిరణ్‌ల కు సవాల్‌
– ముస్లింల వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తాం
– జగనన్నతోనే ముస్లింలకు రిజర్వేషన్‌
– ఎంపీ మిధున్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాష్ట్రంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు , కిరణ్‌లు ప్రధాని నరేంద్రమోదీతో చెప్పించండి అంటు ఎంపీ మిధున్‌రెడ్డి సవాల్‌ విసిరారు. బుధవారం పుంగనూరులో మీడియా సమావేశంలో ఎంపీ మిధున్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు సభలో తెలిపిన మేరకు రాష్ట్రంలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏ చట్టం చేసిన దానిని వ్యతిరేకిస్తామని, ముస్లింలకు అండగా నిలుస్తామని మిధున్‌ స్పష్టం చేశారు. అందులో రెండో ఆలోచన ఉండదన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా తెలిపినట్లు తెలంగాణతో సహా దేశమంతా 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన ఎన్‌డిఏ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఏపిలో ముస్లిం 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని చంద్రబాబునాయుడు చెప్పించగలడా..? చెప్పించగలడా.? అలా చెప్పే దమ్ముదైర్యం చంద్రబాబుకు ఉందా..? అంటు నిలధీశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ముస్లింలకు ఎంతో ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. సభలో మోదీ ముందు మాట్లాడకుండ ప్రచార సభల్లో ముస్లింలకు అది చేస్తాం..ఇది చేస్తాం అంటు మాయమాటలు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. జగనన్న చెప్పిన మేరకు తాము రాజశేఖర్‌రెడ్డి బిడ్డనని , ముస్లింల అభివృద్ధికి, వారి హక్కుల రక్షణకు ఎల్లవేళలా అండగా ఉంటామని మిధున్‌ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు ఉమ్మడి పార్టీ అభ్యర్థులు చెబుతున్న మాయమాటలను గమనించి తగిన గుణపాఠం నేర్పాలన్నారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరికి రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగనన్నను రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపదకళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం పాల్గొన్నారు.

 

Tags: Can you tell PM Modi that 4 percent reservation will be given to Muslims..?

Post Midle