ఏపిలో పది పరీక్షలు రద్దు – ఇంటర్‌ సఫ్లిమెంటరీ రద్దు

Date:20/06/2020

అమరావతి ముచ్చట్లు:

ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలను కూడ రద్దు చేస్తూ మంత్రి ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిపారు. కాగా కరోనా ప్రభలుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండ, తల్లిదండ్రులు ఆందోళనలు చెందకుండ ఉండేందుకు పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలతో లక్షలాది మంది ఇంటర్‌, పదోతరగతి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టిటిడి కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జెఈవో ఎస్‌.భార్గ‌వి అభినందనలు

Tags: Cancelación de diez pruebas en AP – Cancelación inter-suplementaria

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *