Natyam ad

నవంబరు 8న పౌర్ణమి గరుడ సేవ రద్దు

తిరుమల ముచ్చట్లు:

చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది. చంద్ర గ్రహణం నాడైన మంగళవారం ఉదయం 8 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా అన్ని రకాల దర్శనాలు, ఆర్జితసేవలు, గరుడ సేవను టిటిడి రద్దు చేసింది.శుద్ధి, ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 7.30 గంటల తర్వాత సర్వదర్శనం భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

 

Post Midle

Tags: Cancellation of Purnami Garuda Seva on 8th November

Post Midle