గుర్తులపై అభ్య ర్థులు ఆందోళన

ఈ గుర్తులతో గెలిచేదెలా..
Date:13/01/2019
వరంగల్ ముచ్చట్లు:
పార్టీరహితంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యులకు  ఎన్నికల సంఘము గుర్తులను ఖరారు చేసింది. సర్పంచ్‌లకు 30 గుర్తులు.. వార్డు సభ్యులకు 20 గుర్తులను కేటాయిం చింది. అయితే కేటాయించిన గుర్తులపై అభ్య ర్థులు ఆందోళన చెందుతున్నారు. బ్యాలెట్ పేపర్ పై గుర్తులు ఒకదానికి ఒకటి దగ్గరి పోలికలు ఉండటంతో ఓటర్లు గందరగోళం అయ్యే అవకాశముందంటున్నారు. ఎన్నికలకు సంబంధించి తొలివిడతలో నామినేషన్ల పక్రియ ముగిసింది. స్క్రూటిని కూడా పూర్తి అయింది.సర్పంచ్ పదవిలో 23,229 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వార్డుల్లో  93,501 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 21 న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసే  అభ్యర్థులకు గుర్తులతో గుబులు పట్టుకుంది.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు ను పోలి ఉండే ట్రక్కు గుర్తు  ఈ వీ ఎం లో కనిపించింది. ట్రక్కు గుర్తుకు కూడా  చాలా మంది ఓటర్లు ఓట్లు వేశారు. మొదటి  ఈవీఎంలో కారు ఉండగా రెండో  ఈ వీ ఎం లో స్వతంత్ర అభ్యర్థికి ట్రక్కు గుర్తు ఉంది. కొంత మంది తెలియక కారు అనుకొని ట్రక్కు గుర్తుకు వేసినట్లుగా ప్రచారం జరిగింది.
దీంతో అభ్యర్థుల మెజార్టీ తగ్గడంతో పాటు నల్లగొండ జిల్లా నకిరేకల్, ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ,రంగారెడ్డి జిల్లా తాండూర్, సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి  నియోజకవర్గంలో టీఆర్ ఎస్ అభ్యర్థులు ఓటమి పాలైనట్లుగా చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుకు భారీగా ఓట్లు పోలయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు ఇప్పుడు అభ్యర్థులకు గుబులు రేపుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల ఊరుపేరు లేకుండా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అభ్యర్థికి అల్ఫాబెట్ ఆర్డర్ లో ఒక నెంబర్ కేటాయిస్తారు. ఆ నెంబరే గుర్తు ముందు ఉంటుంది. అంతేకానీ అభ్యర్థి పేరుగానీ ఫొటో గాని బ్యాలెట్ పేపర్ లో ఉండదు. ఓటు వేసే వాళ్లు తమ అభ్యర్థి సీరియల్ నెంబర్ అయినా గుర్తు పెట్టుకోవాలి లేదంటే అభ్యర్థికి వచ్చిన గుర్తునైనా గుర్తు పెట్టుకోవాలి. అయితే ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల్లో తొందరగా గుర్తుపట్టని  సింబల్స్ ఉండడంతో గ్రామీణ నిరక్షరాస్య ఓటర్లు అయోమయానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
సర్పంచ్, వార్డు సభ్యుల గుర్తులు కూడా దగ్గరి పోలికలు ఉంటే మరింత గందరగోళం తప్పదు. సర్పంచ్‌కి వేసే ఓటు.. వార్డు సభ్యులకు వేసే అవకాశం ఉంది. గుర్తును ప్రచారం చేసుకోవడం కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. సులువుగా గుర్తు ఉండి అర్థమయ్యే గుర్తులు ఎన్నో ఉన్నాయి. అలాంటివి విడిచి పెట్టి కష్టమైన గుర్తులు కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న పంచాయతీ బరిలో దిగుతున్న అభ్యర్థులను గుర్తులు గందరగోళంలో పడేస్తున్నాయి
Tags:Candidates on the marks are concerned

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *