ఎంపీలకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీలు : సీఎం చంద్రబాబు

Candle rallies supporting MPs: CM Chandrababu

Candle rallies supporting MPs: CM Chandrababu

Date:13/03/2018
అమరావతి ముచ్చట్లు:
ఆర్థిక నేరస్థులు ప్రధానిని కలవడం ఎక్కడైనా ఉందా అంటూ విపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్ష విమర్శలు చేశారు. అలాగే పీఎంవో చుట్టూ నిందితుడి ప్రదక్షిణలు ఏం సంకేతాలు పంపిస్తున్నాయని  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. మంగళవారం ఆయన టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒకవైపు విశ్వాసం ఉందంటారు. మరోవైపు అవిశ్వాసం పెడతామంటారు. ప్రజలు వైసీపీని ఛీకొట్టే రోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు అన్నారు. కేంద్రం వైఖరిని కుడా అయన  తీవ్రంగా దుయ్యబట్టారు. పార్లమెంటులో చేసిన పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని, విభజన హామీలను అమలు చేయమనడం అహేతుకమా అని ప్రశ్నించారు. పార్లమెంటులో ఎంపీల ఆందోళనను అభినందించిన ఆయన ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకుని ఆందోళనను ఉదృతం చేయాలన్నారు. టీడీపీ ఎంపీలు కలిసికట్టుగా ఉండాలని, చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నారు. అలాగే ఇది కీలక సమయమని, సభకు ఎవరూ గైర్హాజరు కారాదని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అలాగే కేంద్రం నుంచి ఎంత వచ్చింది. ఇంకా రావాల్సింది ఆన్లైన్లో పెట్టామని, యూసీలు, డీపీఆర్లు ఆన్లైన్లో ఉన్నాయని ఎంపీలు వాటిని వినియోగించుకోవాలని సీఎం అన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆందోళణ కొనసాగించాలన్నారు. నిర్మాణాత్మకంగా ఆందోళన కొనసాగించాలని సూచించారు. ఎంపీలకు  మద్దతుగా రాష్ట్రంలో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగించాలన్నారు. రాష్ట్రప్రజల మనోభావాల విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.సభ నుంచి సస్పెండ్ చేస్తే బయట పోరాటం ఉధృతం చేయాలని, విభజన చట్టం, హామీలపై సమీక్ష చేసి ప్రజలకు చెప్పాలన్నారు. దేశం మొత్తానికి విషయం తెలియాలన్నారు. ఏ సభ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలని, ఏ పార్టీలైతే ఏపీకి అన్యాయం చేశాయో వాటివల్లే న్యాయం జరిగేలా ఒత్తిడి తేవాలని చంద్రబాబు అన్నారు.
Tags; Candle rallies supporting MPs: CM Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *