ఆకలి తీర్చలేకపోతున్న అన్న క్యాంటీన్లు

Canines that are unable to starve

Canines that are unable to starve

Date:01/01/2019
కాకినాడ ముచ్చట్లు:
రూపాయికే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి, పేదల కడుపు నింపిన నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లు.. అన్నార్తుల ఆకలిని పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి. నాణ్యత లోపం, నానాటికీ పడిపోతున్న పరిమాణం, రుచి లేమి తదితర లోపాలు కనిపిస్తుండడంతో అన్న క్యాంటీన్లపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా క్యాంటీన్లలో తొలి రోజుల్లో ఉన్న నాణ్యత ఇప్పుడు ఉండటం లేదు. రుచికరమైన భోజనం పెట్టడం లేదు. పెట్టాల్సిన అన్నంలో ఒక్కొక్కరికి 70 నుంచి 80 గ్రాముల వరకూ కోత పెడుతున్నారు. దీంతో భోజనం కోసం వచ్చిన వారందరూ అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 6 బౌల్స్‌ అన్నం, రెండు బౌల్స్‌ సాంబారు, ఒక బౌల్‌ పూర్తిగా కూర ఇచ్చేవారు. క్యాంటీన్లలో తింటున్నవారి సంఖ్య పెరగడంతో అన్నాన్ని ఆరు నుంచి తొమ్మిది బౌల్స్‌కు పెంచారు. సాంబారు యథాతథంగానే రెండు బౌల్స్‌ ఇస్తున్నారు. కూర సగానికి పైబడి ఉన్న రెండు బౌల్స్‌తో అందిస్తున్నారు. ఇప్పుడిదే సమస్యగా మారిందని సిబ్బంది చెబుతున్నారు.
గతంలో పెద్ద బౌల్స్‌లో వచ్చేవని, ఇప్పుడా బౌల్స్‌ సైజు కూడా తగ్గిపోయిందని, భోజనం రుచి కూడా తగ్గిపోయిందని సాక్షాత్తూ సిబ్బందే చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భోజనం సరఫరా చేస్తున్న ‘అక్షయపాత్ర’ సంస్థ నుంచే ఆవిధంగా వస్తోందని సిబ్బంది అంటున్నారు.
ప్రచారం కోసం అన్న క్యాంటీన్లను భారీగా ఏర్పాటు చేసినా ఆ తర్వాత ప్రభుత్వం వీటి నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు సన్నబియ్యం పెడితే ఇప్పుడా బియ్యం నాసిరకంగా ఉండడానికి ప్రభుత్వమే కారణమని పలువురు చెబుతున్నారు. సాధారణంగా భోజనం పెట్టేటప్పుడు ముందుగా సంబంధిత పర్యవేక్షకులు రుచి చూసి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలి. ఇక్కడా పరిస్థితి కనిపించడం లేదు. తమకొచ్చిన భోజనం రుచికరమైనదా, కాదా అనేది చూడకుండా ప్రజలకు నేరుగా పెట్టేస్తున్నారు. అది నాణ్యతగా లేకపోవడంతో తింటున్న వారందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఒక్కో క్యాంటీన్‌లో ఎనిమిది మంది చొప్పున పని చేస్తున్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. జీతాల్లేని వారు ఏ మేరకు బాధ్యతగా పని చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం చేసినా సిబ్బందిని ప్రశ్నించే పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు.
Tags:Canines that are unable to starve

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *