Natyam ad

గంజాయి నయా ట్రెండ్

విశాఖపట్టణం ముచ్చట్లు:


తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి గమ్మత్తుగా చిత్తు చేస్తోంది. రాజకీయాల్లో మాటల మంటలకు అదే కారణం అని చెప్పకతప్పదు. గుజరాత్‌లో దొరికిన మత్తు పదార్ధాల దగ్గర్నించి.. నిత్యం విశాఖ, ఏవోబీలో పట్టుబడే గంజాయి వరకూ అంతా రాజకీయ నేతల మధ్య వాగ్వాదానికి కారణం అవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. గంజాయిని సాగుచేసే రైతులు అనుసరిస్తున్న విధానాలు ఔరా అనిపించకమానవు.ఇటీవల కాలంలో గంజాయి రవాణాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు కొత్త విధానాలు అవలంభిస్తున్నారు… ఇంతవరకు వ్యాపారస్తులే నేరుగా ఏజెన్సీకి వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో దాడులు జరిగితే నేరుగా వారిపై కేసులు నమోదవుతున్నాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు కొత్త విధానాలను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం గంజాయిని సాగుచేసే రైతులే నేరుగా వ్యాపారులు చెప్పిన చోటుకు అప్పజెప్పేవిధంగా ఒప్పందం చేసుకుంటున్నారు.తాజాగా జరిగిన ఉదంతమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. గురువారం నర్సీపట్నం మండలం,

 

 

గబ్బాడ వంతెన వద్ద పట్టుకున్న గంజాయి అక్రమ రవాణాలో రైతులే నేరుగా తరలిస్తూ పట్టుబడడం పోలీసులను ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఈ ఘటనలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి, నర్సీపట్నం వైపు వస్తున్న ఐషర్ వ్యాన్ లో వున్న ఐదుగురిలో, ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. మిగిలిన ఇద్దరైన పాంగి రవి, కిముడు రాజేంద్రలను పట్టుకొని పోలీసులు ప్రశ్నించారు.తమ పొలంలో తాము పండించిన గంజాయిని నేరుగా వ్యాపారస్తులకు అప్పగించి, నగదు తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నామని వివరించారు. దీనిలో భాగంగా చేపల మేత మొక్కజొన్నల మాటున గంజాయిని రవాణా చేస్తున్నట్టు వివరించారు.ఈ ఘటనలో 1,720కిలోల గంజాయిని పట్టుకున్న నర్సీపట్నం రూరల్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి, వ్యాన్ సీజ్ చేశారు. ఇలాంటి రవాణా విధానం వల్ల వ్యాపారస్తులు తప్పించుకోవడం, పండించిన రైతులే కటకటాల పాలవడం జరుగుతుంది.

 

Post Midle

Tags: Cannabis is the new trend

Post Midle