Date:05/12/2020
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం సిఐ రాజు, టిఎస్ఎస్పి సిబ్బందితో కలిసి శనివారం ఉదయం జగ్గారం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వాహానం లో 163 ప్యాకెట్లలో ఉన్న 326 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాహనంలో ఇద్దరు వ్యక్తులు ముకుంద కారా, మధులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితులు ఒడిశా రాష్ట్రంలోని మల్కానగిరి జిల్లా నుంచి ఈ గంజాయిని తరలిస్తుండగా స్వాదీనం చేసుకునన్నామని సిఐ వెల్లడించారు. వీరిద్దరు ఒడిశా జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ కు కు అక్రమంగా తరలిస్తున్నారని అయన అన్నారు.
చిన్నారిని చితకబాది హతమార్చిన తండ్రి
Tags: Cannabis possession