Natyam ad

చిత్తూరు జిల్లాలో కానరాని కాంగ్రెస్ ప్రచారం..?

-పిసిసి అధ్యక్షులు వైయస్సార్ నేతృత్వంలో రాష్ట్రంలో సభలు, ప్రచారాలు
-జిల్లాను బ్రష్టు పెట్టిస్తున్న డిసిసి అధ్యక్షులు
-జిల్లా మాజీ నేతలు, కార్యకర్తల ఆవేదన
-చిత్తూరు జిల్లా బాధ్యతపై పిసిసి అధిష్టానం చర్యలు చేపట్టాలని సూచన

శ్రీరంగరాజపురం

Post Midle

దేశం లోనే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రచారం దిశగా రాష్ట్రంలో మార్పు తేవాలని వైయస్సార్ షర్మిల రెడ్డికి పిసిసి బాధ్యతలు అప్పజెప్పింది. పిసిసిగా పదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు తనదైన శైలిలో వాడి వేడిగా ప్రతి నాయకులని, కార్యకర్తలని కలుపుకొని సభలు, సమావేశాలు ,పత్రిక సమావేశాల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల, అక్రమాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ప్రతిపక్ష పార్టీ కన్నా ముందుగా నేనున్నానంటూ ప్రజలకు భరోసాన్నిస్తుండడం నేడు రాష్ట్రంలో చర్చనీయాసం అయింది. ఇలాంటి క్రమంలో నూతనంగా చిత్తూరు జిల్లా డిసిసి అధ్యక్షులుగా పోటుగారి భాస్కర్ పదవి బాధ్యతలు చేపట్టారు. సరే… కష్ట కాలంలో పదవి చేపట్టినందుకు సంతోషం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నడవాలంటే డిసిసి అధ్యక్షులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం అలవాయితి. అలా కాక ప్రస్తుత డిసిసి అధ్యక్షులు తన స్వలాభం కోసం ప్రణాళిక తయారు చేసుకోవడంలో ఉన్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న నాయకుల ఉత్సాహం కొరవడిందని పలువురు నాయకులు మాజీ నేతలు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

ఒక్క ఏఐసీసీ కార్యవర్గ సభ్యులుగా ఉన్న రాకేష్ రెడ్డి ఉత్సాహంతో షర్మిలమ్మ సభ జయప్రదం నుంచి, నియోజకవర్గం లో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతుండడం కొసమెరుపు. అలాగే నగరి నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్ బాబు గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండి నేతలను, కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. ఇటీవల షర్మిలమ్మ సభ నగిరి లో జరిగిన సభను జయప్రదం చేపట్టడంలో ఎనలేని కృషి చేశారు. ఇలా జిల్లాలో కాంగ్రెస్ ఊబందుకుంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టేది. ఇలా ఊపు రాని కాంగ్రెస్ పార్టీకి డిసిసి అధ్యక్షులు పోటుగారి భాస్కర్ ఒక ప్రధాన కారణంగా నిలిచారని జిల్లా మొత్తం కోడై కూస్తుంది. ఇకపై కాంగ్రెస్ అధిష్టానం జిల్లాపై చర్యలు చేపట్టకపోతే కనీస ఓటు బ్యాంకుకు తయారు చేయక పోవడం జరుగుతుందని కార్యకర్తల మనోభావం దెబ్బతినే విధంగా డిసిసి అధ్యక్షుల వ్యవహారం తీరు జిల్లాలో చర్చనీయాసం అయింది. రిజర్వుడు నియోజకవర్గమైన గంగాధర్ నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ కి పెట్టని కంచుకోట.

 

 

అలాంటి పార్టీని కనీస ఓటర్ , ఏజెంట్లను కూడా తయారు చేసుకోలేక డిసిసి అధ్యక్షులు వ్యవహార శైలి ఇలా ఉంది. మండలానికి ఒక్క కార్యకర్తను కూడా తయారు చేయలేక పోవడం నియోజకవర్గం లో కాంగ్రెస్ గ్రాఫ్ అతి దారుణంగా పడిపోయింది. నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కనీస మండల అధ్యక్షులు లేక పోవడం ఆయన డిసిసి పదవికి మచ్చ తెచ్చింది. ప్రజల్లో లేని నాయకులను తయారు చేసుకోవడం ఆయనకు అలవాటు… ఈ అలవాటుతో ఎన్నికలు ముందు తన వర్గంగా ఉన్న వారికి సీటు ఇప్పించుకుని.. డబ్బులు దులుపుకోవడం జరుగుతుందినీ నాయకులు కార్యకర్తలు బహిర్గతంగా చర్చలు లేపుతున్నారు. ఇకనైనా చిత్తూరు జిల్లాపై కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాలంటే యువతలను కలిసి నూతన నాయకత్వం పట్టిస్త ద్వారా చర్యలు చేపడితే పార్టీ పునర్జీవనం దిశగా అడుగులు వేస్తుందని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

 

డిసిసి అధ్యక్షులు మార్చకపోతే కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం కలగకపోవచ్చు

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో డిసిసి అధ్యక్షులుగా ఉన్న పోటుగారి భాస్కర్ ని తప్పించి ఉత్సాహవంతుడైన యువకులకు ఆ పదవిని కట్టబెట్టాలని పలువురు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. డిసిసి అధ్యక్షుల విషయంలో ప్రక్షాళన జరగకపోతే చిత్తూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కనీస ఓటు బ్యాంకు అని కూడా సాధించిగా కనుమ పోవడం జరుగుతుందని బహిర్గతంగా ద్వారా నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా చిత్తూరు జిల్లా పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టాలని మాజీ నేతలు కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు అధిష్టానం దృష్టికి సూచనలు ఇవ్వడం ఇప్పుడు జిల్లాలో చర్చ నియాసం అయింది.

 

Tags:Can’t Congress campaign in Chittoor district..?

Post Midle