ప్రశ్నించే గొంతును అణిచివేయలేరు..వైఎస్ విజయమ్మ
హైదరాబాద్ ముచ్చట్లు:
చంచల్ గూడ మహిళ జైలులో రిమాండ్ లో ఉన్న షర్మిలను విజయమ్మ కలిసి పరామర్శించారు. అనంతరం జైలు వద్ద మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకను ప్రభుత్వం నోక్కుతుందన్నారు. షర్మిల విద్యార్థుల కోసం పోరాడుతుంది. విద్యార్థుల భవిషత్తు నాశనం అయ్యింది. వేల కిలోమీటర్లు పాద యాత్ర చేసి ప్రభుత్వ వైఫల్యాలను విప్పి చూపించింది. ఆమె బయకు వస్తే పోలీసులు అడ్డుకొంటున్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని అన్నారు. షర్మిలమ్మ ఎవరికోసం పోరాడుతుందో ప్రజలందరూ గమనించాలి. ప్రశ్నించే గొంతును అణిచివేస్తే.. ప్రజలే ప్రశ్నించే రోజు వస్తుంది. పోలీసుల అత్యుత్సాహం వలనే ఇలా జరిగింది. దేవుడు ఆశీస్సులు , ప్రజల ఆశీస్సులతో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నా. బెయిల్ పై విడుదల అయ్యాక కుడా షర్మిల మళ్ళీ ప్రజల సమస్యలపై పోరాడుతుంది , ప్రశ్నిస్తుందని ఆమె స్పష్టం చేసారు.
Tags: Can’t suppress questioning voice..YS Vijayamma

