గాన గాంధర్వుడు ఎస్పీ బీ అస్తమయం

Date:25/09/2020

చెన్నై ముచ్చట్లు:

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన ఇక లేరన్న వార్త విని సంగీత అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇంజినీరింగ్ మధ్యలో మానేసిన
ఆయన సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో సుమారు 40వేలకు పైగా పాటలు పాడిన ఆయన గొంతు మూగబోయిందని తెలుసుకున్న అభిమానులు
తట్టుకోలేకపోతున్నారు.కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన బాలు భారతీయ సంగీత ప్రపంచంలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏకంగా 16 భాషల్లో పాటలు పాడారు. మరే గాయకుడిని
ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదు. అయితే ఉన్నత దశకు చేరిన తర్వాత కొత్తవారిని తొక్కేశారన్న ఆరోపణ ఆయనపై ఉంది. కానీ కెరీర్లో తాను ఎవరికీ హాని తలపెట్టలేదని, కొత్త టాలెంట్‌ ఎక్కడున్నా
ప్రోత్సహించేవాడినని ఇచ్చిన ఇంటర్వూలో బాలు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న కొన్ని విశేషాలు చూద్దాం.నా జీవితం వింతైనది. మొదట్లో నాకు సంగీతంపై ఆసక్త లేదు. ఇంజినీరు
కావాలని కలలు కని చివరికి గాయకుడిని అయ్యాను. సింగర్‌గా ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. సుమారు 20ఏళ్ల పాటు సిగరెట్లు తాగాను. 40 ఏళ్ల కెరీర్లో రోజుకు 10 గంటలు పాటలు పాడాను.
నేను అందరికీ గాత్రం మార్చి పాడలేదు. అల్లురామలింగయ్యకు, రాజబాబుకు వారివారి గాత్రాలకు దగ్గరగా పాడాను. ఎన్టీయార్‌, ఏఎన్నార్‌లకు మాత్రమే గాత్రం మార్చి పాడేవాడిని.నాకున్న పేరు
ప్రతిష్ఠల వల్ల నా కొడుకు కెరీర్ సక్రమంగా కొనసాగలేదు. చరణ్‌ను అందరూ నాతో పోల్చి చూడటం వల్ల వాడికి చాలా నష్టం జరిగింది. సంగీతం అని, నటన అని, సినిమా నిర్మాణం అని తడబడ్డాడు.
ఐదు సినిమాలు నిర్మించి రూ.11కోట్లు నష్టపోయాడు. కెరీర్లో ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు పొందారు. మరణించే వరకు పాడుతూనే ఉండాలి. చావు నా దగ్గరికి వచ్చినట్లు తెలియకుండానే
నేను కన్నుమూయాలి. అదే నా చివరి కోరిక’ అంటూ బాలు తన మనసులో మాట చెప్పారు.

 

నాకు పేరంట్స్ లేరు : అవంతి

Tags:Cantando Gandharva SP B Sunset

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *