నిరుపేదల ఆకలి తీర్చనున్న అన్న క్యాంటీన్లు

Canteen who are hungry for hunger

Canteen who are hungry for hunger

Date:11/07/2018
విజయవాడ ముచ్చట్లు:
పేదలకు మూడుపూటలా భోజనం కాస్ట్లీ వ్యవహారమైన రోజులివి. ఇక ఏదైనా పనిపై వారు బయటకు వస్తే.. హోటల్, రెస్టారెంట్..ల్లో ఏం తినాలన్నా బిల్లు భారీగా ఉంటోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు చౌక ధరకే నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలిని తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసింది. తక్కువ ధరలకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. మొదటి విడతగా గురువారం 60 క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్యాంటీన్లలో 5రూపాయలకే అల్పాహారం, భోజనం లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 203 క్యాంటీన్ల అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడుపూటలా కలిపి 73 రూపాయలు ఖర్చయ్యే ఆహారాన్ని ప్రభుత్వం రూ.15కే అందిస్తోంది. క్యాటరింగ్‌ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. రోజు రెండు లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది.203 క్యాంటీన్ల ఏర్పాటుకు 200 కోట్ల నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఒక్కొక్క క్యాంటిన్‌ ఏర్పాటుకు 36లక్షలు మంజూరు చేసింది. అంతే కాక ఆహార సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుంది. వారంలో ఆరు రోజులపాటు ఈ క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు నిరంతరాయంగా ఆహారాన్ని అందించే చర్యలు తీసుకున్నారు. 203 క్యాంటీన్ల ఏర్పాటుకు 200 కోట్ల నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఒక్కొక్క క్యాంటిన్‌ ఏర్పాటుకు 36లక్షలు మంజూరు చేసింది. అంతే కాక ఆహార సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుంది. వారంలో ఆరు రోజులపాటు ఈ క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు నిరంతరాయంగా ఆహారాన్ని అందించే చర్యలు తీసుకున్నారు. అన్న క్యాంటీన్లు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్‌, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు, అందే విధంగా రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తాయి. నిరుపేదల ఆకలి తీర్చడానికి కృషిచేస్తాయి. సోమవారం అల్పాహారంగా ఇడ్లీ లేదా పూరి, మంగళవారం ఇడ్లీ, ఉప్మా, బుధవారం ఇడ్లీ, పొంగలి, గురువారం ఇడ్లీ, పూరి, శుక్రవారం ఇడ్లీ, ఉప్మా, శనివారం ఇడ్లీ, పొంగలి అందించనున్నారు. ప్లేటుకు మూడు ఇడ్లీ లేదా మూడు పూరి, ఇక ఉప్మా, పొంగలి 200 గ్రాముల చొప్పున ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నంతోపాటు ఒక కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అందించనున్నారు. మధ్మాహ్నం, రాత్రి భోజనంలో అన్నం 400 గ్రాములు, కూర 100 గ్రాములు, సాంబారు 120 గ్రాములు, పెరుగు 75 గ్రాములు అందించనున్నారు.
నిరుపేదల ఆకలి తీర్చనున్న అన్న క్యాంటీన్లు https://www.telugumuchatlu.com/canteen-who-are-hungry-for-hunger/
Tags:Canteen who are hungry for hunger

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *