కర్నూలులో సగమే అన్న క్యాంటిన్లు

Cantons are halfway in Kurnool

Cantons are halfway in Kurnool

 Date:12/10/2018
కర్నూలు  ముచ్చట్లు:
 ఐదు రూపాయలకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్‌లు అందరి ఆకలి తీర్చడం లేదు. అసలు భోజనం టోకెన్‌ పట్టాలంటేనే గంటకుపైగా నిరీక్షించాల్సిన పరిస్థితి. కర్నూలు కార్పొరేషన్ లో 8 అన్న క్యాంటీన్లు మంజూరు చేసిన ప్రభుత్వం నాల్గింటిని మాత్రమే గత జూన్‌లో ప్రారంభించింది. ఉల్చాల రోడ్డు, కల్లూరు ఇండస్ట్రియల్‌ ఏరియా, పాతబస్టాండ్, కలెక్టరేట్‌ వద్ద క్యాంటీన్లు నడుస్తున్నాయి. తక్కువ ధరకే భోజనం కావడంతో తినేందుకు జనం క్యూ కడుతున్నా నిర్వాహకులు కొందరికి మాత్రమే టోకెన్లు ఇచ్చి అయిపోయాయంటూ వెనక్కు పంపుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టోకెన్లు ఇచ్చిన వారికి కూడా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని తెలుస్తోంది. టిఫిన్‌కు ఇడ్లి తప్ప ఏమీ ఉండడం లేదు.  అన్న క్యాంటీన్లలో డిమాండ్‌కు తగ్గట్టు టిఫిన్‌ కానీ, భోజనం కాని అందడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. పాతబస్టాండ్, కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్లకు పేదల నుంచి డిమాండ్‌ అధికంగా ఉంది. అందరికీ టోకన్లు అందుతాయన్న గ్యారంటీ లేకపోవడంతో పేదలు గంట ముందే వచ్చి క్యూ కడుతున్నారు. అయితే క్యూలైన్‌లో నిలిచి ఉన్నా అందరికీ టోకెన్లు రావడం లేదు. దీంతో గంటలకొద్ది క్యూలో నిల్చున్న వారు చివరకు టోకెన్‌ అందక వెనక్కు వెళ్తున్నారు.అప్పటికీ అందరికీ టోకెన్లు ఇస్తారన్న గ్యారంటీ లేదు.
దీంతో చాలా మంది క్యూలో నిల్చొని కూడా టోకెన్‌ అందక వెనక్కు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు  ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. అధికారం చేపట్టిన తర్వాత నాలుగేళ్లు పట్టించుకోకుండా ఉండి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎట్టకేలకు పథకాన్ని పట్టాలెక్కించింది. అయితే డిమాండ్‌ మేరకు కాకుండా ప్రచారం కోసమే అన్నట్లు కొనసాగిస్తుండడం గమనార్హం. అందరికీ కాకుండా కొద్ది మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి మిగతా వారిని వెనక్కు పంపుతున్నారు. దీంతో అందరికీ కడుపు నిండా భోజనం అంటే ఇదేనా అని జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Tags:Cantons are halfway in Kurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *