పోలీసుల ఆధీనంలోకి రాజధాని గ్రామాలు

Date:30/11/2020

అమరావతి ముచ్చట్లు:

సోమవారం నుంచి ప అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో రాజధాని గ్రామాలు పోలీసుల ఆధీనం లోకి వెళ్లాయి. ఆ ప్రాంతాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. రైతుల ఆందోళనల నేపధ్యంలో రాజధాని రైతులతో పోలీసులు  చర్చలు జరిపారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు శిబిరంలో అందోళన  విరమించాలని  రాజధాని రైతులను  పోలీసులు కోరారు. మూడు రాజధానుల మద్దత్తుదారుల శిబిరం తొలగిస్తే తాము శిబిరంలో   ఆందోళనలు విరమిస్తామని పోలీసులకు  రాజధాని రైతులు తేల్చిచెప్పారు. ప్రోటోకాల్ సేఫ్టీ పేరుతో తమను ఆందోళన విరమించమని చెప్పి మూడు రాజధానుల శిబిరం వారికి ఎలా మద్దతిస్తారని వారు  పోలీసులను ప్రశ్నించారు.

మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం

Tags: Capital villages under police control

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *