రాజధాని రైతులను ఆదుకుంటాం

Capital will help farmers

Capital will help farmers

Date:14/12/2019

విశాఖపట్నం ముచ్చట్లు:

రాజధాని ప్రాంతంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్ప సత్యన్నారాయణ హామీ ఇచ్చారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని, అమరావతిలో భవనాలు నిర్మాణ దశలో ఉన్నావాటిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. టిడిపి నేతలు అసెంబ్లీలో దుర్భాషలాడుతూ సభను సజావుగా జరగనివ్వడం లేదని విమర్శించారు. తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని,రాష్ట్రంలో మహిళలకు,బాలికలకు రక్షణ కల్పించడానికే దిశ యాక్ట్ తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలటీల్లో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. విశాఖ మెట్రో రెండు ఫేస్ లుగా చేయాలని నిర్ణయించకున్నామని,భోగాపురం ఎయిర్ ఫోర్టు మరల టెండరుకు వెళ్ళాలా అనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

 

క్షేత్రస్థాయి ప్రత్యక్ష పరిశీలన మీదటే మున్సిపల్ వార్డు హద్దులు నిర్ణయించాలి

 

Tags:Capital will help farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *