Natyam ad

మైలార్ దేవ్ పల్లి లో కారు బీభత్సం

రంగారెడ్డి ముచ్చట్లు:


సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. దుర్గా నగర్ చౌరస్తా లో  డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. రోడ్డు పై ఆగి ఉన్న కారు ను ఢీ కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారు లో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్ధి చంద్రశేఖర్ మృతి చెందాడు.  మరో ఇద్దరు విద్యార్ధులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని  హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి  పరిస్థితి విషమంగా వుందని సమాచారం.  విద్యార్దులు ఫుల్ గా మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Tags: Car accident in Mylar Dev Palli

Post Midle
Post Midle