కారు దగ్దం..వ్యక్తి సజీవ దహనం
మెదక్ ముచ్చట్లు:
మెదక్ జిల్లా టేక్మాల్ (మం) వెంకటాపురం శివారులో కారులో వ్యక్తి సజీవ దహనం అయిన విషయం బయటపడింది. కారు పూర్తిగా కాలిపోయి వుంది. గుర్తు తెలియని వ్యక్తి అగ్నికి ఆహుతైయాడు. కారులో ఓ బ్యాగు, పక్కన పొదల్లో పెట్రోల్ డబ్బా ను పోలీసులు గుర్తించారు. రోడ్డు పక్కన పొదల్లో ఉదయం కాలిపోయి కారు కనిపించింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..లేక ఎవరైనా సజీవ దహనం చేసారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Tags: Car burning.. Person burning alive